Hebah Patel: గతంలో డేటింగ్‌ చేశా, ఇప్పుడు మాత్రం సింగిల్‌.. ప్రేమ, పెళ్లిపై హెబ్బా ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌..

Hebah Patel: కుమారి 21ఎఫ్‌తో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకుంది అందాల తార హెబ్బా పటేల్‌. ఫస్ట్‌ సినిమానే అయినా నటనలో మెచ్యూరిటీ చూపించిన ఈ బ్యూటీ నటిగా మంచి మార్కులు..

Hebah Patel: గతంలో డేటింగ్‌ చేశా, ఇప్పుడు మాత్రం సింగిల్‌.. ప్రేమ, పెళ్లిపై హెబ్బా ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌..
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 15, 2022 | 9:35 AM

Hebah Patel: కుమారి 21ఎఫ్‌తో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకుంది అందాల తార హెబ్బా పటేల్‌. ఫస్ట్‌ సినిమానే అయినా నటనలో మెచ్యూరిటీ చూపించిన ఈ బ్యూటీ నటిగా మంచి మార్కులు కొట్టేసింది. అలాగే అందంతో కుర్రకారులను కూడా కట్టిపడేసిందని చెప్పాలి. అనంతరం పలు వరుస సినిమాల్లో నటించినా హెబ్బాకు ఆశించిన స్థాయిలో మాత్రం విజయాలను అందుకోలేకపోయింది. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ ‘ఓదెల రైల్వే స్టేషన్’, ‘తెలిసినవాళ్లు’, ‘వల్లన్’ చిత్రాల్లో నటిస్తోంది. ఈ సినిమాలతో మళ్లీ ఫామ్‌లోకి రావాలని భావిస్తోందీ బ్యూటీ.

ఇదిలా ఉంటే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హెబ్బా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రేమ, పెళ్లి విషయాలపై తొలిసారి ఓపెన్‌ అయ్యింది. ఈ సందర్భంగా హెబ్బా మాట్లాడుతూ.. ‘గతంలో నేను కూడా డేటింగ్ చేశాను. ఆ అబ్బాయి ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాదు. అయితే తొలి సినిమా విడుదలకు ముందే బ్రేక్‌ అయ్యింది. ఆ సమయంలో సినిమాలతో బిజీ కావడంతో బ్రేకప్‌ గురించి ఎక్కువ ఆలోచించలేదు.

ప్రస్తుతం నేను సింగిల్‌గానే ఉన్నాను’ అని చెప్పుకొచ్చంది. ఇక తనకు కాబోయేవాడు ఎలాంటి వాడు అయ్యుండాలనే ప్రశ్నకు బదులిస్తూ.. ‘నేను ఊరికే ఏదో ఒకటి వాగుతూనే ఉంటాను. అందుకే తక్కువ మాట్లాడే అబ్బాయి కావాలి. సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ ఉండాలి. ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ అస్సలు ఉండకూడదు. నన్ను ప్రేమగా చూసుకోవాలి’ అని పెద్ద జాబితానే ముందు పెట్టింది అందాల తార.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
రవి అనుగ్రహం.. ఆ రాశుల వారికి శుభ యోగాలు, విజయాలు..!
రవి అనుగ్రహం.. ఆ రాశుల వారికి శుభ యోగాలు, విజయాలు..!
ప్రయాగ్ రాజ్ కు వెళ్తున్నారా.. ఈ ప్రాచీన దేవాలయాలపై ఓ లుక్ వేయండి
ప్రయాగ్ రాజ్ కు వెళ్తున్నారా.. ఈ ప్రాచీన దేవాలయాలపై ఓ లుక్ వేయండి