Karthikeya 2: కంటెంట్‌ ఉంటే బొమ్మ పక్కా హిట్‌ అని నిరూపించిన కార్తికేయ 2.. హిందీలో ఒక్కసారిగా పెరిగిన స్క్రీన్‌ల సంఖ్య..

Karthikeya 2: కంటెంట్‌ ఉండాలే కానీ బొమ్మ బంపర్‌ హిట్‌ అవుతుందని మరోసారి నిరూపించిన చిత్రం కార్తికేయ 2. నిఖిల్‌ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు భారీ విజయాన్ని..

Karthikeya 2: కంటెంట్‌ ఉంటే బొమ్మ పక్కా హిట్‌ అని నిరూపించిన కార్తికేయ 2.. హిందీలో ఒక్కసారిగా పెరిగిన స్క్రీన్‌ల సంఖ్య..
Karthikeya 2
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 15, 2022 | 8:54 AM

Karthikeya 2: కంటెంట్‌ ఉండాలే కానీ బొమ్మ బంపర్‌ హిట్‌ అవుతుందని మరోసారి నిరూపించిన చిత్రం కార్తికేయ 2. నిఖిల్‌ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. విడుదలైన తొలి షో నుంచి పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకొని వసూళ్ల వర్షం కురిపిస్తోంది. పాన్‌ ఇండియా చిత్రంగా విడుదలైన ఈ సినిమా నెమ్మదిగా అన్ని చోట్ల కలెక్షన్లను పెంచుకుంటూ పోతోంది. యూనివర్సల్‌ స్టోరీ లైన్‌ ఉండడం, కథా.. కథనం ఆకట్టుకుకోవడంతో అన్ని ప్రాంతాల ప్రజలను కార్తికేయ మెస్మరైజ్‌ చేస్తోంది.

విడుదలైన రెండు రోజుల్లోనే బ్రేక్‌ ఈవెన్‌ను దాటేసిందీ సినిమా. తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్ల మంచి వసూళ్లను రాబట్టుతోన్న కార్తికేయ 2.. హిందీ వెర్షన్‌లోనూ సత్తా చాటుతోంది. నార్త్‌లో కూడా ఈ సినిమాకు బజ్‌ వచ్చింది. దీంతో థియేటర్ల సంఖ్య భారీగా పెంచేశారు. మొదటి రోజు కేవలం 60 స్క్రీన్‌లలో విడుదల చేస్తే. రెండో రోజుకే స్క్రీన్‌ల సంఖ్యను ఏకంగా 300కి పెంచేశారు. చిత్రానికి మంచి టాక్‌ రావడం, ప్రేక్షకులూ ఆసక్తి చూపిస్తుండడంతో ఈ సంఖ్యను మరింత పెంచేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా కార్తికేయ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇందులో నిఖిల్‌కు జోడిగా అనుపమ నటించింది.

Karthikeya

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..