Liger: నన్ను అలా పిలవొద్దు.. చాలా ఇబ్బందిగా ఉంటోంది.. నేనింకా చిన్నపిల్లాడినే.. విజయ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

Vijay Deverakonda Liger: టాలీవుడ్‌ రౌడీ విజయ్‌ దేవరకొండ హీరోగా డ్యాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh)దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లైగర్‌. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 25న రిలీజ్ కానుంది..

Liger: నన్ను అలా పిలవొద్దు.. చాలా ఇబ్బందిగా ఉంటోంది.. నేనింకా చిన్నపిల్లాడినే.. విజయ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌
Vijay Devarakonda
Follow us
Basha Shek

|

Updated on: Aug 15, 2022 | 8:03 AM

Vijay Deverakonda Liger: టాలీవుడ్‌ రౌడీ విజయ్‌ దేవరకొండ హీరోగా డ్యాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh)దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లైగర్‌. బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే (Ananya Pandey) రౌడీతో రొమాన్స్‌ చేయనుంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 25న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. దీంతో ప్రమోషన్‌ కార్యక్రమాల్లో మరింత స్పీడ్‌ పెంచింది చిత్రబృందం. తాజాగా ఫ్యాన్‌డమ్‌ టూర్‌’లో భాగంగా ఆదివారం వరంగల్‌లో పర్యటించింది. కాగా విజయ్‌ పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. సూపర్‌ స్టార్‌ అన్న ట్యాగ్‌ను కూడా తగిలించారు. అయితే తనను సూపర్‌స్టార్‌ అని పిలవొద్దని, అలా పిలుస్తుంటే ఇబ్బందిగా ఉందన్నాడు విజయ్‌. తానింకా చిన్నపిల్లాడినేనంటూ.. జీవితంలో సాధించాల్సింది చాలా ఉందంటూ ఆసక్తికర కామెంట్లు చేశాడు.

మైండ్‌లో ఫిక్స్‌ అయ్యాం..

‘లైగర్‌ ప్రచారంలో భాగంగా నేను ఇప్పటివరకు చూడని ఎన్నో ప్రాంతాలకు వెళ్లాను. అక్కడి వారంతా నాపై మాటల్లో చెప్పలేనంత ప్రేమ చూపించారు. తెలుగు ప్రేక్షకుల వల్లే ఇదంతా సాధ్యమైందనుకుంటున్నా. దేశవ్యాప్తంగా నాకు పేరు రావడానికి తెలుగు ఆడియెన్సే కారణమనుకుంటా. అయితే నేనింకా చిన్న పిల్లాడినే. నన్ను సూపర్‌ స్టార్‌.. సూపర్‌ స్టార్‌ అని పిలుస్తుంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. దానికి నేనింకా చాలా కష్టపడాలి’’ ఈ సినిమాలో హీరో, అతని తల్లి ఇండియాను షేక్‌ చేయాలని కరీంనగర్‌ నుంచి ముంబయికి వెళతారు. అలా నేనూ పూరి జగన్నాథ్, ఛార్మీ ముగ్గురం కలిసి ముంబయి వెళ్లాం. ఏది ఏమైనా ఈసారి భారీ హిట్‌ కొట్టాలని మైండ్‌లో గట్టిగా ఫిక్స్ అయ్యాం’ అని తెలిపాడు విజయ్‌. కాగా రౌడీతో పాటు డైరెక్టర్‌ పూరి, నిర్మాత ఛార్మీ, హీరోయిన్‌ అనన్యా పాండేలు తమ ప్రసంగంతో ఆకట్టుకున్నారు. సినిమా సూపర్‌డూపర్‌ హిట్‌ అవుతుందన్నారు. కాగా ఈ వేడుకకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌, హనుమకొండ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌, నగర మేయర్‌ గుండు సుధారాణి, డిప్యూటీ మేయర్‌ రిజ్వానా షమీమ్‌ అతిథులుగా హాజరయ్యారు. లైగర్‌ భారీ విజయం సాధించాలని ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..