RRR: ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియా కనిపించేది అంతే సమయమా ?.. రెమ్యునరేషన్ తెలిస్తే షాకవ్వాల్సిందే..
దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్
దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటిస్తుండడంతో ఈ మూవీ గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మొదటి నుంచి ఆర్ఆర్ఆర్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాడు జక్కన్న. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు లెటేస్ట్ అప్డేట్స్ బయటకు వస్తున్నాయి.
ఇందులో రామ్ చరణ్‌కు జోడీగా అలియా భట్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ పాత్ర కోసం అలియా భారీగానే డిమాండ్ చేసిందని టాక్ వినిపిస్తుంది. కేవలం 10 రోజుల షూటింగ్‌కు గానూ.. అలియా ఏకంగా రూ. 5 కోట్లు తీసుకుందట. అంటే రోజుకు రూ. 50 లక్షలు తీసుకున్నట్లుగా టాక్. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియా 15 నిమిషాల స్క్రీన్ టైమ్‌తో ఉంటుంది. ప్రస్తుతం అలియా భట్.. ఒక్కో సినిమాకు 9 నుంచి 10 కోట్లు అందుకుంటుంది. రెండు నెలలు కాల్షీట్స్ కేటాయిస్తుంది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఏకంగా ఈ బ్యూటీ 5కోట్లు తీసుకోవడంతో సినీ ప్రముఖులు షాకవుతున్నారు. టికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక ఇటీవల విడుదలైన నాటు నాటు వీర నాటు సాంగ్ నెట్టింట్లో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే.
Also Read: Ranveer Singh “83” : ఆ క్యాచ్ కోసం కపిల్ దేవ్ 20 గజాలు వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్లారట..
Evaru Meelo Koteeswarulu: మహేష్ గెలుచుకున్న మనీ ఎంతో తెలుసా.. ఆ మొత్తాన్ని ఏంచేశారంటే..