AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadde Naveen: ఈ పదేళ్లలో ఆ టాలీవుడ్ హీరో ఎదిగిన తీరు అద్భుతం.. అతనిని చూసి నేనే షాకయ్యా: వడ్డే నవీన్

సుమారు పదేళ్ల తర్వాత మళ్లీ సినిమా చేశారు సీనియర్ హీరో వడ్డే నవీన్. ఆయన నటించిన లేటెస్ట్ సినిమా ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడిన వడ్డే నవీన్ ఓ టాలీవుడ్ హీరోపై ప్రశంసలు కురిపించారు.

Vadde Naveen: ఈ పదేళ్లలో ఆ టాలీవుడ్ హీరో ఎదిగిన తీరు అద్భుతం.. అతనిని చూసి నేనే షాకయ్యా: వడ్డే నవీన్
Vadde Naveen
Basha Shek
|

Updated on: Jun 11, 2026 | 4:46 PM

Share

ఒకప్పుడు టాలీవుడ్ లో ఉన్న హ్యాండ్సమ్ హీరోల్లో వడ్డే నవీన్ ఒకరు. 1997లో కోరుకున్న ప్రియుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా దగ్గరైపోయారు. పెళ్లి, మనసిచ్చి చూడు, లవ్ స్టోరీ 1999, స్నేహితులు , నా హృదయంలో నిదురించే చెలీ, ప్రేమించే మనసు, మా బాలాజీ, చాలా బాగుంది, బాగున్నారా, మా ఆవిడ మీదొట్టు.. మీ ఆవిడ చాలా మంచిది, చెప్పాలని ఉంది, అయోధ్య , ఆదిలక్ష్మి, నా ఊపిరి.. ఇలా ఎన్నో మంచి సినిమాలు వడ్డే నవీన్ ఫిల్మోగ్రఫీలో ఉన్నాయి. అయితే 2010 తర్వాత సినిమాలు బాగా తగ్గించేశారు నవీన్. చివరిగా 2016లో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఎటాక్ అనే సినిమాలో మాత్రమే కనిపించారు. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు అనే సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో నవీన్ చురుగ్గా పాల్గొంటున్నారు. పలు ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. ఇందులో భాగంగానే తెలుగు సినిమా ఇండస్ట్రీ, టాలీవుడ్ హీరోలు అందులోనూ ప్రభాస్, అల్లు అర్జున్ ల గురించి తన అభిప్రాయాలు షేర్ చేశారు.

‘గత పదేళ్లలో అల్లు అర్జున్ సాధించిన విజయాలు నిజంగా అద్భుతం. ఆయన కెరీర్ గ్రోత్ చాలా ప్రత్యేకంగా ఉంది. తెలుగు సినిమాను దేశవ్యాప్తంగా తీసుకెళ్లిన హీరోల్లో అల్లు అర్జున్ కూడా ఒకరు. ప్రభాస్ చేసిన బాహుబలి విజయం కొంతవరకు ఊహించిందే. ఎందుకంటే ఆ సినిమా స్కేల్, విజువల్స్, కథనం అన్నీ చాలా పెద్ద స్థాయిలో ఉన్నాయి. అలాంటి సినిమా దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతుందని ముందే అంచనా వేయొచ్చు. పైగా దర్శకుడు రాజమౌళి మేకింగ్ స్టైల్ ఆయనకున్న క్రేజ్ వల్ల ఆ సినిమా అంతటి ఘనవిజయం సాధిస్తుందనే అంచనాలు ముందే ఉన్నాయి. కానీ ‘పుష్ప’ విషయంలో పరిస్థితి పూర్తిగా భిన్నం. నిజానికి పుష్ప సినిమాను వాళ్లు ఒక పక్కా తెలుగు సినిమాగా, రీజినల్ కంటెంట్ తోనే ప్రారంభించారు. కానీ అది రిలీజ్ అయ్యాక నార్త్ బెల్ట్ తో పాటు ప్రపంచవ్యాపంగా ఎలాంటి బాసింగ్ సక్సెస్ సాధించిందో మనమంతా చూశాం. బపుష్ప సినిమా అంత పెద్ద రేంజ్ కు వెళుతుందని, వరల్ స్టేజ్ పై అంతగా గుర్తింపు తెచ్చుకుంటుందని బహుశా ఎవరూ ఊహించి ఉండరు. అందుకే గత పదేళ్లలో అల్లు అరున్ సాధించిన ఈ గ్లోబల్ సక్సెస్ నాకు ఒక బెస్ట్ సర్పైజ్. పుష్ప పాత్ర, డైలాగ్స్, మేనరిజమ్స్, పాటలు దేశమంతటా వైరల్ కావడం వల్ల అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా మారారు’ అని వడ్డే నవీన్ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం వడ్డే నవీన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us