AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhurandhar Director: ఫ్యాన్స్ పండగ చేస్కోండి.. ఆ టాలీవుడ్ స్టార్ హీరోతో ధురంధర్ డైరెక్టర్ నెక్ట్స్ సినిమా!

ఆదిత్య ధర్.. మొన్నటివరకు కేవలం బాలీవుడ్ లో మాత్రమే వినిపించిన.. కానీ ఇప్పుడు ఈ డైరెక్టర్ పేరు వరల్డ్ వైడ్ వినిపిస్తోంది. ఆయన తెరకెక్కించిన 'ధురంధర్', 'ధురంధర్ ది రివేంజ్' సినిమాలు వేల కోట్ల కలెక్షన్లు రాబట్టాయి. ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టాయి.

Dhurandhar Director: ఫ్యాన్స్ పండగ చేస్కోండి.. ఆ టాలీవుడ్ స్టార్ హీరోతో ధురంధర్ డైరెక్టర్ నెక్ట్స్ సినిమా!
Dhurandhar director Aditya Dhar
Basha Shek
|

Updated on: Jun 11, 2026 | 4:12 PM

Share

‘ధురంధర్’ సిరీస్ తో పాన్ వరల్డ్ ఫేమస్ అయిపోయాడు డైరెక్టర్ ఆదిత్య ధర్. ప్రస్తుతం ఆయనతో సినిమా తీసేందుకు స్టార్ హీరోలు సైతం క్యూలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. బాలీవుడ్ తో పాటు సౌత్ లోని స్టార్స్ కూడా ఆదిత్య ధర్ తో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకోసం తమ పీఆర్ టీమ్స్ ద్వారా గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఒక స్టార్ హీరో అయితే ‘ధురంధర్ 2’ విడుదలైనప్పటి నుంచి ఆదిత్య చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నారని టాక్. అయితే ధురంధర్ డైరెక్టర్ మాత్ర తన తర్వాతి సినిమా విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నారని టాక్. తన కథకు సరిపోయే హీరో ఎంపిక కోసం బాగా కసరత్తులు చేస్తున్నారని సమాచారం. గతంలో టాలీవుడ్ స్టార్స్ అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి పాన్ ఇండియా హీరోలతో ఆదిత్య ధర్ సినిమాలు చేయనున్నాడని పుకార్లు వినిపించాయి. అయితే ఇవి రూమర్లు గానే మిగిలిపోయాయి. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం ఆదిత్య ధర్ పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తో చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు టాక్. ఇందుకోసం ఆయన ఒక పవర్ ఫుల్ సబ్టెక్ట్ కూడా రెడీ చేశారని సమాచారం. త్వరలోనే ప్రభాస్ ని స్వయంగా కలిసి ఈ స్క్రిప్ట్ వినిపించబోతున్నట్టు సమాచారం.

ధురందర్, ధురందర్ ది రివేంజ్ తో సహా అంతకు ముందు ఆదిత్య ధర్ తీసిన సినిమాలన్నీ యదార్థ సంఘటనలకు సంబంధించినవే. ఇప్పుడు ప్రభాస్ తో కూడా ఓ రియల్ అన్ టోల్డ్ స్టోరీనే ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ కోసం ఇటీవలే ఆదిత్య ధర్ ,ప్రభాస్ కలిశారని సమాచారం. అలాగే కొన్ని ఐడియాస్ కూడా షేర్ చేసుకున్నారు. అయితే ప్రభాస్ తో సినిమా కంటే ముందు రణ్ వీర్ సింగ్ తోనే మరో సినిమాను ఆదిత్య ధర్ తెరకెక్కిస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. మరి ధురంధర్ తర్వాతి సినిమా రణ్ వీర్ సింగ్ తోనా? లేదా ప్రభాస్ తోనా? అన్నది క్లారిటీ రావాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

మరోవైపు ప్రభాస్ మాత్రం ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఓ వైపు దర్శకుడు సందీప్‌ వంగాతో స్పిరిట్ సినిమా షూటింగ్ జరుగుతోంది. అలాగే ఫౌజీ కూడా సెట్స్ పై ఉంది. వాటితో పాటు కల్కి-2, సలార్-2 సినిమాలు కూడా డార్లింగ్ కంప్లీట్ చేయాల్సి ఉంది. మరి వీటి మధ్య ఆదిత్య ధర్ తో సినిమా అంటే చాలా రోజులు ఆగాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us