Surya: సినీ పరిశ్రమ గొంతు కోయడం చట్టం కాదు… కేంద్రం తీరుపై హీరో సూర్య విమర్శలు.. మీ అభిప్రాయాలు చెప్పాలంటూ..
కేంద్రం ప్రవేశ పెట్టిన సినిమాటోగ్రఫీని సవరించే బిల్లుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాటోగ్రఫీని సవరించే బిల్లును 2019 ఫిబ్రవరి 12న శాసనసభలో ప్రవేశ పెట్టారు.
కేంద్రం ప్రవేశ పెట్టిన సినిమాటోగ్రఫీని సవరించే బిల్లుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాటోగ్రఫీని సవరించే బిల్లును 2019 ఫిబ్రవరి 12న శాసనసభలో ప్రవేశ పెట్టారు. తిరిగి ఈ బిల్లును ఇప్పుడు మళ్లీ పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ సవరణ కింద ఒకసారి సెన్సార్ చేసిన సినిమాలు తిరిగి సెన్సార్ షిప్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఈ నూతన చట్టంకు సామాజిక కార్యకర్తలతోపాటు.. పలువురు సినీ ప్రముఖులు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే డైరెక్టర్ కార్తీ సుబ్బరాజు ట్వీట్ చేయగా.. తాజాగా తమిళ్ స్టార్ హీరో సూర్య సైతం ట్విట్టర్ వేదికగా అసహనం వ్యక్తం చేశారు.
భారతీయ సినీ పరిశ్రమను క్రమబద్దీకరించడానికి సినిమాటోగ్రఫీ బిల్లు 1952ను కేంద్రం మార్పు చేస్తుంది. ఇందుకు సంబంధి.. ప్రజలు జూలై 2లోపు తమ అభిప్రాయాలను వెల్లడించాలని కేంద్రం కోరింది. దీంతో ఈ నూతన బిల్లుపై సినీ ప్రముఖులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక బిల్లుపై హీరో సూర్య స్పందిస్తూ… “ఈ నూతన చట్టం.. భావ ప్రకటన స్వేచ్చను కాపాడడం కాదు.. దాని గొంతును పరిమితం చేయడమే మాత్రమే అవుతుంది. ఈ బిల్లుపై స్పంధించడానికి ఈరోజే ఆఖరు. ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాలను తెలపండి ” అంటూ కామెంట్ చేశాడు. అంతేకాకుండా.. అభిప్రాయాలను చెప్పాల్సిన వెబ్ సైట్ కూడా అందుబాటులో ఉంచాడు.
ట్వీట్..
சட்டம் என்பது கருத்து சுதந்திரத்தை காப்பதற்காக.. அதன் குரல்வளையை நெறிப்பதற்காக அல்ல…#cinematographact2021#FreedomOfExpression
Today’s the last day, go ahead and file your objections!!https://t.co/DkSripAN0d
— Suriya Sivakumar (@Suriya_offl) July 2, 2021
అంతకుముందు సీనియర్ హీరో కమల్ హాసన్ సైతం.. నూతన బిల్లుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన తన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. “సినిమా, మీడియా, విద్య అనేవి భారతదేశం యొక్క చిహ్నాలు వంటివి. కానీ వాటి చూపు, చెవులు, గొంతును మూసివేయడం సరైనది కాదు.. వీటి స్వేచ్చను అణచివేస్తే ప్రతికూల ప్రభావం చూడాల్సి వస్తుంది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ మాట్లాడాలి ” అంటూ ట్వీట్ చేశారు..
ట్వీట్..
Cinema, media and the literati cannot afford to be the three iconic monkeys of India. Seeing, hearing and speaking of impending evil is the only medication against attempts to injure and debilitate democracy. (1/2)
— Kamal Haasan (@ikamalhaasan) June 28, 2021