AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: తమిళ స్టార్ డైరెక్టర్స్ కన్ను మెగా వారసులపై పడిందా ? చరణ్‏కు పోటీగా బన్నీ పాన్ ఇండియా ప్రాజెక్ట్..

ప్రస్తుతం టాలీవుడ్‏లో తమిళ దర్శకుల హావా నడుస్తుందనే చెప్పుకోవాలి. తెలుగు హీరోలతో పాన్ ఇండియా చిత్రాలను తెరకెక్కించడానికి తమిళ్ దర్శకులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.

Allu Arjun: తమిళ స్టార్ డైరెక్టర్స్ కన్ను మెగా వారసులపై పడిందా ? చరణ్‏కు పోటీగా బన్నీ పాన్ ఇండియా ప్రాజెక్ట్..
Allu Arjun
Rajitha Chanti
|

Updated on: Jul 02, 2021 | 6:11 PM

Share

ప్రస్తుతం టాలీవుడ్‏లో తమిళ దర్శకుల హావా నడుస్తుందనే చెప్పుకోవాలి. తెలుగు హీరోలతో పాన్ ఇండియా చిత్రాలను తెరకెక్కించడానికి తమిళ్ దర్శకులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ఎనర్జిటిక్ స్టార్ రామ్ తమిళ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుండగా.. త్వరలో మెగాస్టార్ చిరంజీవి కూడా మోహన్ రాజా దర్శకత్వంలో నటించనున్నాడు. ఇక మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ కూడా తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో పాన్ ఇండియా చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న చెర్రీ… ఆ తర్వాత పూర్తిగా పాన్ ఇండియా చిత్రాలను చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే తదుపరి ప్రాజెక్ట్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నాడట చెర్రీ. శంకర్- చరణ్ సినిమా ఇప్పటికే స్టార్ట్ కావాల్సి ఉండగా.. అనివార్య కారణాల వలన సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. దీంతో చరణ్.. ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాలపైనే దృష్టి సారించాడు.

ఇదిలా ఉంటే.. మెగా కాంపౌండ్‏లో ఇప్పుడు పోటీతత్వం కనిపిస్తోంది. ముఖ్యంగా రామ్ చరణ్, బన్నీలా మధ్య కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఇద్దరూ కూడా తమ ఇమెజ్ ఏమాత్రం తగ్గకుండా సినిమా ఎంపికలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించారు కూడా. ఈ మూవీ తర్వాత వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో మరో భారీ బడ్జెట్ సినిమా చేయనున్నాడు బన్నీ. ఇక ఈ రెండు పాన్ ఇండియా చిత్రాల తర్వాత కూడా అల్లు అర్జున్ మరో భారీ చిత్రాన్ని చేయాలని భావిస్తున్నారట. అందుకే తమిళ స్టార్ డైరెక్టర్ ఎఆర్ మురగదాస్ తో కలిసి సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడట బన్నీ. అతడితే ప్రాజెక్ట్ ఓకే చేసేందుకు చర్చలు సాగిస్తున్నారట. ఇప్పటికే మురగదాస్ బన్నీకి కథ వినిపించడమే కాకుండా.. మరోసారి బన్నీని కలిశారట. ఇక ఈ మూవీకి అల్లు అర్జున్ ఇంకా ఓకే చెప్పలేదు. ఒకవేళ బన్నీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లయితే.. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్ థాను నిర్మిస్తారని సమాచారం.

ఇప్పటికే చరణ్ పాన్ ఇండియా డైరెక్టర్ తో సినిమా చేయబోతుండడం.. ఇప్పుడు బన్నీ కూడా మరో సక్సెస్ ఫుల్ దర్శకుడిని ఎంచుకోవడంతో వీరిద్ధరి మధ్య పోటీ ఎక్కువగానే ఉండేలా కనిపిస్తుంది. పుష్ప తర్వాత వీలైనంత తొందరంగా మురుగదాస్ – బన్నీ కాంబో కూడా సెట్స్ పైకి వెళ్లనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

Also Read: Urvashi Rautela: వయ్యారాల ఊర్వశి రౌతేలా…. బాపుగారి బొమ్మలా ఎంత చక్కగా ముస్తాబైందో.. ఒంటిపై 62 లక్షల ఖరీదైన..

Tirumala Rush: గతనెలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య తక్కువే.. కానీ గణనీయంగా పెరిగిన హుండీ ఆదాయం..

Murder Case: హత్య చేస్తాడన్న భయంతోనే చంపేశారు.. దుర్గా అగ్రహారం మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు