Sri Simha: శ్రీసింహా, రాగ మాగంటి ఆరేళ్ల ప్రేమకథ.. భార్య గురించి స్పెషల్ పోస్ట్ చేసిన హీరో..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు శ్రీసింహ. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తనయుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ హీరోగా.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నాడు. ఇటీవలే మత్తు వదలరా 2 సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన శ్రీసింహ.. తాజాగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు.
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి చిన్న కొడుకు శ్రీసింహా ఇటీవలే పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సీనియర్ నటుడు, మురళీమోహన్ మనవరాలు రాగ మాగంటితో శ్రీసింహ ఏడడుగులు వేశాడు. డిసెంబర్ 14న దుబాయ్ లో వీరిద్దరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. అలాగే శ్రీసింహా, రాగ పెళ్లి వేడుకలలో డైరెక్టర్ రాజమౌళి తన భార్యతో కలిసి స్టెప్పులేసిన సంగతి తెలిసిందే. తాజాగా తన భార్యను పరిచయం చేస్తూ స్పెషల్ పోస్ట్ చేశాడు శ్రీసింహ. ఆరేళ్లుగా తాము ప్రేమలో ఉన్నామంటూ అసలు విషయం రివీల్ చేశాడు శ్రీసింహ.
“ఇప్పటికీ ఆరేళ్లయ్యింది. ఎప్పటికీ ఇలాగే ” అంటూ రాసిపెట్టుంది అంటూ హ్యాష్ ట్యాగ్ ఇచ్చాడు. అంటే ఆరేళ్లుగా రాగ, శ్రీసింహ ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే వీరిద్దరు పెద్దలను ఒప్పించి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరగ్గా ఈనెల 14న దుబాయిలోని ఓ ఐలాండ్ లో పెళ్లి జరిగింది. నటుడు మురళీ మోహన్ తనయుడు రామ్ మోహన్ కుమార్తె రాగ మాగంటి. విదేశాల్లో బిజినెస్ లో మాస్టర్స్ పూర్తి చేసిన రాగ మాగంటి.. ప్రస్తుతం తన ఫ్యామిలీకి సంబంధించిన వ్యాపారాలు చూసుకుంటుంది.
ఇక శ్రీసింహా.. యమదొంగ సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత సునీల్ నటించిన మర్యాద రామన్న సినిమాలో నటించాడు. ఆ తర్వాత మత్తు వదలరా సినిమాతో హీరోగా మారాడు. తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, ఉస్తాద్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఇటీవలే మత్తు వదలరా 2 సినిమాతో మరోసారి థియేటర్లలో సందడి చేశాడు.
View this post on Instagram
ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‌బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..
Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‌గా..
Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..
Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‌ను మించిన అందం.. ఎవరంటే..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.