AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కార్పొరేట్ శక్తులు పంచభూతాలను కూడా అమ్ముకుంటాయి.. కేంద్ర బడ్జెట్ పై ఆందోళన వ్యక్తం చేసిన నారాయణ మూర్తి..

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ కార్పొరేట్ బడ్జెట్ ను తలపిస్తుందని ప్రముఖ సినీనటులు, దర్శక నిర్మాత, సామాజిక విశ్లేషకులు ఆర్. నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. ఈ సందర్భమగా నారాయణమూర్తి మాట్లాడుతూ..

కార్పొరేట్ శక్తులు పంచభూతాలను కూడా అమ్ముకుంటాయి.. కేంద్ర బడ్జెట్ పై ఆందోళన వ్యక్తం చేసిన నారాయణ మూర్తి..
Rajeev Rayala
|

Updated on: Feb 03, 2021 | 4:49 PM

Share

R. Narayana Murthy : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ కార్పొరేట్ బడ్జెట్ ను తలపిస్తుందని ప్రముఖ సినీనటులు, దర్శక నిర్మాత, సామాజిక విశ్లేషకులు ఆర్. నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. ఈ సందర్భమగా నారాయణమూర్తి మాట్లాడుతూ.. బడ్జెట్ లో రైతులకు గిట్టుబాటు ధర కల్పించే అంశాన్నే ప్రస్తావించలేదని ఆరోపించిన నారాయణమూర్తి… డాక్టర్ స్వామినాథన్ ప్రతిపాదనల మేరకు బడ్జెట్ కేటాయిస్తే రైతులకు రుణాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.

తెలుగు రాష్ట్రాలను విస్మరించి ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాలకు అనుకూలంగా కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిందని ఆరోపించిన నారాయణమూర్తి…. జీఎస్టీ, సెస్ లను కేంద్రం పరిధిలోకి తీసుకెళ్తే రాష్ట్రాలు సంక్షేమ పథకాలను ఎలా అమలు చేస్తాయని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కుప్పకూల్చి ప్రైవేటుపరం చేస్తే కార్పొరేట్ శక్తులు.. పంచభూతాలను కూడా అమ్ముకుంటాయని, అప్పుడు సామాన్యుడి పరిస్థితి ఏమిటని నారాయణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాలను కేంద్రం సమంగా చూడాలని కోరారు. కేంద్ర ప్రవేశ పెట్టిన బడ్జెట్ వల్ల ధనికులు మరింత ధనికులవుతారు.. పేదవారు మరింత పేదవారవుతారని నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తాను నిర్మిస్తున్న ‘రైతన్న’ సినిమా ప్రస్తుతం ఫైనల్ మిక్సింగ్ జరుగుతుంది అని అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఫిబ్రవరి నెలాఖరులో కానీ మార్చి ప్రథమార్థంలో కానీ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని ఆయన అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Nagarjuna’s ‘Bangarraju’ : బరిలోకి ‘బంగార్రాజు’.. త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనున్న కింగ్ నాగార్జున

అంత‌రించిపోతున్న హ‌స్త క‌ళ‌ల నేప‌థ్యంలో రానున్న ‘రాధాకృష్ణ‌’… చిత్రయూనిట్‌కు అభినందనలు తెలిపిన తెలంగాణ మంత్రి…

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..