రవితేజ చేతులమీదుగా శింబు ‘రీవైన్డ్’ సినిమా టీజర్.. అదిరిపోయిందంటూ ప్రశంసలు కురిపించిన మాస్ మాహారాజా..

తమిళ స్టార్ హీరో శింబు ప్రస్తుతం నటిస్తున్న సినిమా 'మానాడు'. ఇందులో శింబుకు జోడిగా కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‏గా నటిస్తుంది. ఈ సినిమాను రూ.125 కోట్ల భారీ బడ్జెట్‏తో

రవితేజ చేతులమీదుగా శింబు 'రీవైన్డ్' సినిమా టీజర్.. అదిరిపోయిందంటూ ప్రశంసలు కురిపించిన మాస్ మాహారాజా..
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 03, 2021 | 4:59 PM

Shimbu Rewind Movie Teaser: తమిళ స్టార్ హీరో శింబు ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘మానాడు’. ఇందులో శింబుకు జోడిగా కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‏గా నటిస్తుంది. ఈ సినిమాను రూ.125 కోట్ల భారీ బడ్జెట్‏తో వి. హౌస్ ప్రొడక్షన్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సురేష్ కామాచి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఫిబ్రవరి 3న శింబు పుట్టినరోజు సందర్భంగా మానాడు మూవీ టీజర్‏ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఇక ఈ సినిమాను తెలుగులో రీవైన్డ్ పేరుతో విడుదల చేయనున్నారు. ఈ మూవీ తెలుగు టీజర్‏ను మాస్ మాహారాజా తన ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు.

టీజర్ విడుదల చేస్తూ.. రవితేజ శింబు మరియు చిత్రయూనిట్ పై ప్రశంసల జల్లు కురిపించారు. “పుట్టిన రోజు శుభాకాంక్షలు శింబు. రీవైన్డ్ టీజర్ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా గ్రిప్పింగ్‏గా కనిపిస్తోంది. చిత్రయూనిట్‏కు నా శుభాకాంక్షలు” అని రవితేజ ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా.. మానాడు టీజర్ చాలా ఆసక్తికరంగా, సరికొత్తగా ఉంది. పొలిటికల్ థ్రిల్లర్‏గా రూపొందుతున్న ఈ సినిమాలో శింబు ముస్లిం వ్యక్తిగా నటిస్తున్నాడు. ఇక ఈ టీజర్లో విచిత్రం ఏంటంటే.. వీడియో మొదలైనప్పటి నుంచి అందులోని సన్నివేశాలన్ని వెనక్కి ప్లే అవుతున్నారు. దీంతో ఈ మూవీ పై ప్రేక్షకులకు మరింత ఆసక్తి పెంచేశారు చిత్రయూనిట్.

రీవైన్డ్ మూవీ టీజర్..