Pawan Kalyan : మొగలాయిలా కాలంనాటి కథతో పవన్- క్రిష్ సినిమా.. టైటిల్ ఇదే అంటూ మరో కొత్తపేరు..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటిసారి హిస్టారికల్ స్టోరీతో ప్రేక్షకులముందుకు రాబోతున్నాడు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా మొగలాయిలా కాలంనాటి కథ అని తెలుస్తుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటిసారి హిస్టారికల్ స్టోరీతో ప్రేక్షకులముందుకు రాబోతున్నాడు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా మొగలాయిలా కాలంనాటి కథ అని తెలుస్తుంది. ఈ చిత్రంలో పవన్ బందిపోటుగా కనిపించనున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం హైదరాబాద్ లో భారీ సెట్ లను కూడా రెడీ చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండేజ్ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. కాగా ఈ సినిమా టైటిల్ పై ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. పలు పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తాజాగా మరో పేరు ఇప్పుడు తెరపైకి వచ్చింది.
గతంలో ఈ సినిమాకు విరూపాక్ష- వీరమల్లు అనే టైటిల్లు ప్రచారం జరిగాయి. ఆతర్వాత హరి హర వీరమల్లు అనే టైటిల్ కూడా వినిపించింది. తాజాగా ‘హరహర మహాదేవ’ అనే టైటిల్ ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ అయ్యింది. ఈ టైటిల్ ను పవన్ సినిమా కోసంమే రిజిస్టర్ చేయించారని ప్రచారం మొదలైంది. కాగా దీనిపై ఇంతవరకు స్పష్టత రాలేదు. ఏ ఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించనున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :