ముంబైలో పాగా వేయనున్న టాలీవుడ్ యంగ్ హీరో.. ప్రభాస్ సినిమా కోసం జిమ్‏లో కసరత్తులు చేస్తున్న స్టార్..

ఇటీవల విడుదలైన 'అల్లుడు అదుర్స్' సినిమా సూపర్ ‏హిట్‏తో ఫుల్ జోష్ మీద ఉన్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ప్రస్తుతం ఈ యంగ్ హీరో.. వివి వినాయక్

ముంబైలో పాగా వేయనున్న టాలీవుడ్ యంగ్ హీరో.. ప్రభాస్ సినిమా కోసం జిమ్‏లో కసరత్తులు చేస్తున్న స్టార్..
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 03, 2021 | 5:32 PM

Actor Bellamkonda Srinivas: ఇటీవల విడుదలైన ‘అల్లుడు అదుర్స్’ సినిమా సూపర్ ‏హిట్‏తో ఫుల్ జోష్ మీద ఉన్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ప్రస్తుతం ఈ యంగ్ హీరో.. వివి వినాయక్ డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నాడు ఈ యంగ్ హీరో. ఇక ఈ మూవీకోసం శ్రీనివాస్ ముంబైకి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ఆసినిమా చిత్రీకరణ పూర్తయ్యేవరకు ముంబైలోని పోష్ జుహు ఏరియాలోని ఓ ఫ్లాట్‏లో బెల్లంకొండ శ్రీనివాస్ ఉండనున్నట్లు సమాచారం.

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్.. బాలీవుడ్ వైపు అడుగులేస్తున్నాడు. తెలుగులో ప్రభాస్ కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచిన ‘ఛత్రపతి’ సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నాడు వినాయక్. అయితే ఈ మూవీ హిందీ రీమేక్‏లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తుండగా.. జయంతిలాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక ఇందులో హీరోయిన్‏గా దివంగత శ్రీదేవి తనయ జాన్వీకపూర్‏ను తీసుకోవాలని భావిస్తున్నాడట డైరెక్టర్. ఇక సినిమా కోసం బెల్లంకొండ ముంబైలోని ఓ జిమ్‏లో కసరత్తులు చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Also Read:

రవితేజ చేతులమీదుగా శింబు ‘రీవైన్డ్’ సినిమా టీజర్.. అదిరిపోయిందంటూ ప్రశంసలు కురిపించిన మాస్ మాహారాజా..

వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న జబర్ధస్థ్ బ్యూటీ.. ఈసారి ఏకంగా ఆ స్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందిగా..