Nithin’s Check Movie Trailer : అంచనాలను పెంచేసిన నితిన్ మూవీ.. ఆకట్టుకుంటున్న ‘చెక్’ ట్రైలర్..
యంగ్ హీరో నితిన్ నటిస్తున్న సినిమా చెక్. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. ‘చదరంగం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
యంగ్ హీరో నితిన్ నటిస్తున్న సినిమా చెక్. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. ‘చదరంగం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నితిన్- చంద్రశేఖర్ ఏలేటి కాంబినేషన్ అనగానే ప్రేక్షకులు ఆశించే అంశాలన్నీ ఇందులో ఉంటాయి. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ కి చక్కటి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ ను విడుదల చేసారు చిత్రయూనిట్.
ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది ఈ ట్రైలర్. ఉరిశిక్ష పడిన ఒక ఖైదీ జైలు నుంచి ఎలా బయట పడ్డాడు. అతడికి ఎదురైనా సమస్యలు ఏంటి..అసలు అతను ఎందుకు దేశద్రోహి అయ్యాడు అనేవి సినిమాలో ఇంట్రస్ట్ కలిగించే అంశాలుగా ఉండనున్నాయని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది. ఈ సినిమాలో లాయర్ గా రకుల్ కనిపించనుంది. మరి కొద్ది రోజులలో ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి కానుంది. మిగిలిన భాగాన్ని చకచకా పూర్తి చేసి వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు చిత్రయూనిట్. ఈ డిఫరెంట్ మూవీపై నితిన్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పుడు ట్రైలర్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేసింది. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి …