డైరెక్టర్‏కు షాక్ ఇచ్చిన టాప్ హీరోయిన్.. సాంగ్ కోసం ఏకంగా షూటింగ్‏నే బ్రేక్ చేసింది ఈ బ్యూటీ..

సాధరణంగా సినిమా స్టోరీతోపాటు అందులో ఉండే సాంగ్స్ కూడా ఎంత హిట్ అవుతాయో తెలిసిన విషయమే.. కొన్ని సందర్భాల్లో సినిమా హిట్ అవ్వకపోయిన కానీ..

డైరెక్టర్‏కు షాక్ ఇచ్చిన టాప్ హీరోయిన్.. సాంగ్ కోసం ఏకంగా షూటింగ్‏నే బ్రేక్ చేసింది ఈ బ్యూటీ..
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 03, 2021 | 5:58 PM

Heroine AliaBhatt : సాధరణంగా సినిమా స్టోరీతోపాటు అందులో ఉండే సాంగ్స్ కూడా ఎంత హిట్ అవుతాయో తెలిసిన విషయమే.. కొన్ని సందర్భాల్లో సినిమా హిట్ అవ్వకపోయిన కానీ.. అందులో ఉండే సాంగ్స్ మాత్రం రికార్డ్స్ క్రియేట్స్ చేస్తుంటాయి. ఇక అందులో హీరోహీరోయిన్లు వేసే స్టెప్పులు కూడా వైరల్ అవుతుంటాయి. సినిమాలో ఉండే సాంగ్ కోసం కొరియోగ్రాఫర్ చేప్పిన విధంగా స్టెప్పులేసి తీరాల్సిందే. ఇక అవి కొన్నిసార్లు సులభంగానే ఉన్నా.. మరికొన్ని స్టెప్పులు కష్టంగా ఉంటాయి. అయితే ఓ టాప్ హీరోయిన్ సాంగ్‏ కోసం స్టెప్పులు నేర్చుకోవడానికి ఏకంగా రెండువారాల పాటు షూటింగ్‏కే బ్రేక్ ఇచ్చేసింది. ఆ హీరోయిన్ ఎవరోకాదండోయ్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్.

ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో అలియా భట్ ‘గంగూబాయ్ కఠియావాడీ’ సినిమా చేస్తుంది. సాధరణంగా సంజయ్ లీలా భన్సాలీ సినిమాలు విభిన్నంగా ఉంటాయి. ఇక సినిమాలతోపాటు పాటే అందులో ఉండే సాంగ్స్ కూడా సరికొత్తగా ఉంటాయి. ఇప్పటికే దీపికా పదుకోనే నటించిన పద్మావత్ మూవీలోని ఘూమర్ సాంగ్ ఎంత హిట్ అయ్యిందో తెలిసిన విషయమే. ఇక ప్రస్తుతం తెరకెక్కుతున్న గంగూబాయ్ కఠియావాడీ సినిమాలో కూడా రెండు సాంగ్స్ ఉన్నాయట. అందులో ఒక సాంగ్ చాలా క్లిష్టంగా ఉంటుందట. ఇక ఆ పాటలో వేసే స్టేప్స్ కూడా కష్టంగానే ఉన్నాయట. దీంతో ఆ స్టెప్స్ నేర్చుకోవడానికి.. మూవీ షూటింగ్‏కు దాదాపు రెండు వారాలు బ్రేక్ ఇచ్చిందట అలియా భట్. రెండు వారాలు ఆ స్టెప్స్ నెర్చుకొని.. తిరిగి చిత్రీకరణలో పాల్గొంటారట. ముంబైలోని కామాటిపురా ప్రాంత వేశ్యలకు నాయకురాలిగా వ్యవహరించి.. మాఫియా క్వీన్‏గా పేరుపొందిన గంగూబాయ్ కోఠేవాలీ జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ముంబైలోని ఫిల్మ్ సిటీలో కామాటిపురా సెట్ వేశారు.. అందులో 200 మంది డ్యానర్లు పాల్గొననున్నారు.

Also Read:

ముంబైలో పాగా వేయనున్న టాలీవుడ్ యంగ్ హీరో.. ప్రభాస్ సినిమా కోసం జిమ్‏లో కసరత్తులు చేస్తున్న స్టార్..