బాలీవుడ్‌కు తాకిన విజయ్ సేతుపతి స్టార్‌డమ్.. వెబ్‌సిరీస్ కోసం భారీగా డిమాండ్ చేసిన మక్కల్ సెల్వన్.. !
ఇప్పుడు ఎక్కడ చుసిన విజయ్ సేతుపతి పేరు మారు మ్రోగుతుంది. విజయ్ సేతుపతి కోసం అటు తమిళ, తెలుగు తో పాటు ఇటు బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా పోటీపడుతోంది. చిన్న సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ సేతుపతి..
vijay sethupathi : ఇప్పుడు ఎక్కడ చూసిన విజయ్ సేతుపతి పేరు మారు మ్రోగుతుంది. విజయ్ సేతుపతి కోసం అటు తమిళ, తెలుగు తో పాటు ఇటు బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా పోటీపడుతోంది. చిన్న సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ సేతుపతి ఇప్పుడు స్టార్ హీరోలకు సరి సమానంగా నిలిచాడు. ఆయన కోసం దర్శకులు నిర్మాతలు క్యూ కడుతున్నారు. తనదైన సహజ నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు సేతుపతి. ఇటీవల ఆయన దళపతి విజయ్ కోసం విలన్ గా కూడా మారారు. విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమాలో సేతుపతి నెగిటివ్ షేడ్స్ ఉన్నపాత్రలో నటించి మెప్పించారు.
ప్రస్తుతం సేతుపతి స్టార్ డమ్ బాలీవుడ్ కు తాకింది. ఆయనతో సినిమా చేయాలని బాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఉత్సాహంగా ఉన్నారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి బాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరో షాహిద్ కపూర్ నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ లో సేతుపతి నటిస్తున్నారు. కాగా ఈ వెబ్ సిరీస్ కోసం విజయ్ సేతుపతి భారీగా డిమాండ్ చేసారని ఓ వార్త చక్కర్లు కొడుతుంది. అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ `సన్నీ’ పేరుతో ఇది రూపొందుతోంది. ఈ సిరీస్ కోసం సేతుపతి సుమారు 55 కోట్లు వరకు డిమాండ్ చేశారని తెలుస్తోంది. అయితే హీరో షాహిద్ కపూర్ ఈ సిరీస్ కోసం 40కోట్లకు ఒప్పందం చేసుకోగా విజయ్ సేతుపతి 55 కోట్లు డిమాండ్ చేయడం ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
మరిన్ని ఇక్కడ చదవండి :