‘F3’ Movie : శరవేగంగా ‘ఎఫ్ 3’ షూటింగ్.. సెట్‌లోకి అడుగు పెట్టిన కో-బ్రోస్.. వెల్కమ్ చెప్పిన డైరెక్టర్
సూపర్ హిట్ దర్శకుడు అనీల్ రావిపూడి ఎఫ్ 3 సినిమాతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైన విషయం తెలిసిందే. వెంకటేష్ , తమన్నా షూటింగ్ లో పాల్గొంటున్నారు..
‘F3’ Movie : సూపర్ హిట్ దర్శకుడు అనీల్ రావిపూడి ఎఫ్ 3 సినిమాతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైన విషయం తెలిసిందే. వెంకటేష్ , తమన్నా షూటింగ్ లో పాల్గొంటున్నారు. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ కూడా ‘ఎఫ్ 3’ సెట్లో అడుగు పెట్టాడు. వరుణ్ కు వెల్కమ్ చెప్తూ చిత్ర దర్శకుడు అనీల్ రావిపూడి సోషల్ మీడియా ద్వారా ఓ ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటోకి కో-బ్రోస్ ఈస్ బ్యాక్ అనే క్యాప్షన్ ఇచ్చాడు అనీల్.
ఈ ఫొటోలో వెంకటేష్ , అనీల్ , వరుణ్ నవ్వులు చిందిస్తూ కనిపించరు. ఇప్పటికే ఐదు హిట్లతో జోష్ మీదున్న అనీల్ ఈ సినిమాతో ఆరో హిట్ అందుకొని డబుల్ హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ సినిమా కోసం దాదాపు 80 కోట్ల బడ్జెట్ పెట్టేస్తున్నాడు నిర్మాత దిల్ రాజు. తొలి భాగం కేవలం 30 కోట్ల లోపు పూర్తి అయిపోయింది. ఆ సినిమా దాదాపు 130 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. జూన్ వరకు ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది. ఆతర్వాత ఒక నెల రోజులు పోస్ట్ ప్రొడక్షన్ చేసి.. మరో నెల రోజులు ప్రమోషన్ చేసుకొని ఆగస్టు 27న సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎఫ్ 3 షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది. త్వరలోనే మరో హీరోయిన్ మెహరీన్ కూడా షూటింగ్ లో జాయిన్ అవ్వనుందని తెలుస్తుంది. మరి ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
Co-Bro’s Are Back ??#F3OnAug27th@Venkymama @IamVarunTej @tamannaahspeaks @Mehreenpirzada @ThisIsDSP@SVC_official #F3Movie #F3 pic.twitter.com/3lyeeN0iuT
— Anil Ravipudi (@AnilRavipudi) February 3, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :
Sundari Movie Trialer: ‘సుందరి’ మూవీ ట్రైలర్ రిలీజ్.. లేడీ ఓరియెంటెడ్ కథతో వస్తున్న పూర్ణ..