Sundari Movie Trailer: ‘సుందరి’ మూవీ ట్రైలర్ రిలీజ్.. లేడీ ఓరియెంటెడ్ కథతో వస్తున్న పూర్ణ..
టాలీవుడ్ హీరోయిన్ పూర్ణ ప్రస్తుతం నటిస్తున్న సినిమా 'సుందరి'. కళ్యాణ్ జీ గోగన డైరెక్షన్లో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
టాలీవుడ్ హీరోయిన్ పూర్ణ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘సుందరి’. కళ్యాణ్ జీ గోగన డైరెక్షన్లో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. లేడీ ఓరియెంటెడ్ మూవీగా వస్తోన్న ఈ చిత్రంలో పూర్ణ లీడ్ రోల్లో నటిస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను విడుదల చేసింది చిత్రబృందం.
తాజాగా విడుదలైన సుందరీ.. పల్లెటూరు అంటేనే అందం. అలాంటి అందమైన ఊర్లో ఒక అందమైన అమ్మాయి కథ అంటూ మొదలైవుతుంది ట్రైలర్. ఒక గృహిణికి జరిగిన అన్యాయాన్ని తను ఎదుర్కోగలిగింది అనే నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతున్నట్లుగా ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాలో దేవత సీరియల్ ఫేం అర్జున్ అంబాటి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.
The Ultimate Decision Of An Innocent Lady
Here’s The Honest Theatrical Trailer Of #Sundari ►https://t.co/xw8fw8TBuE@shamna_kasim #KalyanjiGogana #Rizwan #BalReddy #SureshBobbili #ArjunAmbati @RizwanEntrepre1 #RizwanEntertainment @Kushi_FME @adityamusic #SriValliChaitanya pic.twitter.com/kE6vKwzuwm
— BARaju (@baraju_SuperHit) February 3, 2021