వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న జబర్ధస్థ్ బ్యూటీ.. ఈసారి ఏకంగా ఆ స్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందిగా..
ఇటు బుల్లితెరపై యాంకర్‌గా కొనసాగుతునే.. అటు వెండి తెరపై వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది అనసూయ. అది క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అయినా.. లేదా ఐటం సాంగ్ అయినా పట్టించుకోకుండా
Anchor Anasuya: ఇటు బుల్లితెరపై యాంకర్‌గా కొనసాగుతునే.. అటు వెండి తెరపై వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది అనసూయ. అది క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అయినా.. లేదా ఐటం సాంగ్ అయినా పట్టించుకోకుండా.. వచ్చిన ఆఫర్లన్నింటికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది ఈ జబర్ధర్థ్ బ్యూటీ. ఇప్పటికే పలు సినిమాల్లో కీలక పాత్రలో నటించిన అనసూయ మరో ఆఫర్ దక్కించుకుంది. మాస్ మాహారాజా రవితేజ ‘ఖిలాడి’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్. ఈసినిమాలో డింపుల్ హాయతి, మీనాక్షి చౌదరీలు హీరోయిన్లుగా నటిస్తుండగా.. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. పెన్ స్టూడియోస్ సమర్పణలో హవీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
“ఖిలాడి టీంలోకి అనసూయకు స్వాగతం” అంటూ ఓ పోస్టర్‌ను ట్విట్టర్లో షేర్ చేసింది చిత్రబృందం. అనసూయ గేమ్ ఛేంజర్ అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు. దీంతో ఈ మూవీలో అనసూయ పాత్ర కీలకమనే అనుకోవాలి. ప్రస్తుతం అనసూయ థ్యాంక్యు బ్రదర్ అనే సినిమాలో నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ మూవీ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. అలాగే కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న రంగ మార్తండ సినిమాలోను అనసూయ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది.
Team #Khiladi Welcomes Beautiful Actress @anusuyakhasba on Board! ?✨
PLAY SMART! ‘coz this Lady can be the Game Changer! ?⏯️@RaviTeja_offl @DirRameshVarma @ThisIsDSP @DimpleHayathi @Meenachau6@idhavish #KoneruSatyanarayana #AStudiosLLP @PenMovies @KHILADiOffl pic.twitter.com/n88audpLsh
— idlebrain.com (@idlebraindotcom) February 3, 2021
Also Read: