అంతరించిపోతున్న హస్త కళల నేపథ్యంలో రానున్న ‘రాధాకృష్ణ’… చిత్రయూనిట్‌కు అభినందనలు తెలిపిన తెలంగాణ మంత్రి…
`ఢమరుకం`ఫేమ్ శ్రీనివాసరెడ్డి స్క్రీన్‌ప్లే, దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న చిత్రం ‘రాధాకృష్ణ’. అనురాగ్, ముస్కాన్ సేథీ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో నందమూరి లక్ష్మీ పార్వతి ఒక కీలకపాత్రలో నటిస్తున్నారు.
`ఢమరుకం`ఫేమ్ శ్రీనివాసరెడ్డి స్క్రీన్‌ప్లే, దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న చిత్రం ‘రాధాకృష్ణ’. అనురాగ్, ముస్కాన్ సేథీ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో నందమూరి లక్ష్మీ పార్వతి ఒక కీలకపాత్రలో నటిస్తున్నారు. టి.డి.ప్రసాద్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్నిహరిణి ఆరాధ్య క్రియేషన్స్ పతాకంపై పుప్పాల సాగరిక కృష్ణకుమార్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫిబ్రవరి5న గ్రాండ్‌గా విడుదలవుతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లోజరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర అటవీ,పర్యావరణ,దేవాదాయ,న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై `రాధాకృష్ట` మూవీ బిగ్‌టికెట్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ ..“నూతనంగా ఏర్పడిన నిర్మల్ జిల్లాలో ప్రకృతి మనకిచ్చిన ప్రసాదం విశాలమైన అడవి, కుంటాల జలపాతం, కవ్వాల్ టైగర్‌జోన్. ఇలాంటి అందమైన లోకేషన్స్‌లో `రాధాకృష్ణ` మూవీ చిత్రీకరించడం నిజంగా అభినందించాల్సిన విషయం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నిర్మల్ కొయ్య బొమ్మల నేఫథ్యంలో, అంతరించిపోతున్న హస్త కళలు, కళాకారుల గురించి సాగరిక కృష్ణకుమార్ మంచి కథను ఎంచుకుని ఈ సినిమాని నిర్మించారు. వారికి నా హృదయపూర్వక అభినందనలు. నిర్మల్ బోమ్మల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూసి ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అలాగే లక్ష్మి పార్వతిగారు ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్ర పోషించడం చాలా సంతోషకరమైన విషయం. హీరో అనురాగ్, హీరోయిన్ ముస్కాన్ సేథీలకు ఈ సినిమా మంచి పేరు తేవాలని ఆశిస్తున్నాను. అలాగే అలీ, కృష్ణ భగవాన్ గారు ఈ సినిమాలో నటించడం జరిగింది వారికి నా అభినందనలు. ఎం.ఎం.శ్రీలేఖగారు మంచి సంగీతం అందించారు వారికి, ఈ సినిమాలో నిర్మల బొమ్మా పాట పాడిన మంగ్లీగారికి అభినందనలు. అలాగే శ్రీనివాస రెడ్డిగారు చాలా ఎక్స్‌పీరియన్స్ డైరెక్టర్ వారు ఈ సినిమాని ముందుండి నడిపారు. పూర్తిగా తెలంగాణలోని నిర్మల్ జిల్లాలోనే చిత్రీకరించిన సినిమా అందులోనూ నిర్మల్ కళాకారుల కష్టాల నేపథ్యంలో మంచి ఆశయంతో తీసిన కాబట్టి తప్పకుండా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీనుకెళ్తాను. ఈ మూవీ పెద్ద సక్సెస్ కావాలని ఆ భగవంతున్ని ప్రార్ధిస్తున్నాను“ అన్నారు.
ఏపీ తెలుగు అకాడమీ అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ – “ఏ దేశపు నాగరికత అయినా ముందుకుపోవాలి అంటే వారి ప్రాచీన సంస్కృతి, సాంప్రదాయాల మీదే ఆధారపడి ఉంటుంది. వాటిని ఎవరైతే నిలబెట్టుకుంటారో ఆ దేశం ఎన్ని సంవత్సరాలైన మనుగడ సాగిస్తుంది. ఆ ప్రాచీన కళల్ని కాపాడుకుంటూ వస్తుంది కాబట్టే మన భారతదేశం ప్రపంచదేశాల్లో మకుటాయమానంగా ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేని ఎన్నో అద్భుతమైన కళలకు భారతదేశం పుట్టినిల్లు. అలాంటి ప్రాచీన కళలను మనం కోల్పోతే మన మనుగడనే మనం కోల్పోవాల్సి వస్తుంది. నిర్మల్ కొయ్య బొమ్మలు ఎంత ఫేమస్ అనేది మనందరికీ తెలుసు. నిర్మల్ బొమ్మలు అంటేనే ఒళ్లు పులకరిస్తుంది. అంతరించి పోతున్న నిర్మల్ కళలను కథగా తీసుకుని ఒక మంచి కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీశారు. ఒక మంచి చిత్రానికి మీ అందరి ఆదరణ తప్పక ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీనివాస్ రెడ్డి గారు నాతో పట్టుబట్టి ఈ సినిమాలో ఒక పాత్ర చేయించడం జరిగింది. చిత్ర యూనిట్, నిర్మల్ ప్రజలు అందరూ ఎంతో ప్రేమతో నన్ను చాలా బాగా చూసుకున్నారు. నా పాత్ర ఎలా చేశాను అన్నది రేపే థియేటర్‌లో ఆడియన్స్ చూసి చెప్పాలి. ఒక గొప్ప ఉద్ధేశ్యంతో మంచి సినిమా తీసిన సాగరిక కృష్ణకుమార్ గారికి నా అభినందనలు. అలి ఇందులో ఒక మంచి క్యారెక్టర్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి చిత్రానికి మీ అందరి ఆదరణ తప్పక ఉండాలని కోరుకుంటున్నాను“ అని అన్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :