Rajasekhar – Jeevitha : సతీమణి దర్శకత్వంలో సీనియర్ హీరో.. మరోసారి రాజశేఖర్‌ను డైరెక్ట్ చేయనున్న జీవిత..!
టాలీవుడ్ సీనియర్ హీరోలు రాజశేఖర్ ఒకరు. చివరగా గరుడ వేగ , కల్కి సినిమాలతో వరుస విజయాలను అందుకున్నారు రాజశేఖర్. కాగా ఇటీవల ఆయన కరోనా మహమ్మారిని పడిన విషయం తెలిసిందే. కరోనా నుంచి ఆయన కోలుకొని ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు.
టాలీవుడ్ సీనియర్ హీరోలు రాజశేఖర్ ఒకరు. చివరగా గరుడ వేగ , కల్కి సినిమాలతో వరుస విజయాలను అందుకున్నారు రాజశేఖర్. కాగా ఇటీవల ఆయన కరోనా మహమ్మారిని పడిన విషయం తెలిసిందే. కరోనా నుంచి ఆయన కోలుకొని ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. అంతే కాదు త్వరలనే ఆయన తిరిగి సినిమాలతో బిజీ కానున్నారని తెలుస్తుంది. ఇటీవలే ఆయనకు కొంతమంది దర్శకులు కథలను వినిపించారట. అయితే రాజశేఖర్ త్వరలో ఆయన సతీమణి జీవిత దర్శకత్వంలో నటించబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మలయాళం సినిమా `జోసెఫ్`ను తెలుగులో రీమేక్ చేయాలని రాజశేఖర్ భావించారు. ఈ సినిమాను దర్శకుడు నీలకంఠ డైరెక్ట్ చేస్తున్నున్నడని వార్తలు వచ్చాయి.
అయితే అనుకోని కారణాలవల్ల ఈ సినిమానుంచి నీలకంఠ తప్పుకున్నారని తెలుస్తుంది. దాంతో ఈ సినిమాను ఎలాగైనా పూర్తి చేయాలనీ దర్శకత్వ బాధ్యతను జీవిత తన భుజాలపైన వేసుకున్నారని ఫిలింనగర్ల్ లో టాక్ వినిపిస్తుంది. గతంలో రాజశేఖర్ నటించిన శేషు, ఎవడైతే నాకేంటి, సత్యమేవ జయతే.. వంటి సినిమాలకు జీవిత దర్శకత్వం వహించారు. ఈ క్రమంలో ఇప్పుడు ఈ మలయాళ రీమేక్ ను కూడా తానే డైరెక్ట్ చేయబోతున్నారని తెలుస్తుంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.
మరిన్ని ఇక్కడ చదవండి :
బ్లాక్ బస్టర్ హిట్ మూవీకి సీక్వెల్ స్టార్ట్ చేయనున్న యంగ్ హీరో.. వచ్చే నెలలో సెట్స్ పైకి..