బ్లాక్ బస్టర్ హిట్ మూవీకి సీక్వెల్ స్టార్ట్ చేయనున్న యంగ్ హీరో.. వచ్చే నెలలో సెట్స్ పైకి..

విభిన్న కథలతో కూడిన సినిమాలతో నటిస్తూ మంచి గుర్తింపు పొందాడు యంగ్ హీరో నిఖిల్. ఇక నిఖిల్ చందు మొండేటి డైరెక్షన్లో 'కార్తికేయ 2' సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

బ్లాక్ బస్టర్ హిట్ మూవీకి సీక్వెల్ స్టార్ట్ చేయనున్న యంగ్ హీరో.. వచ్చే నెలలో సెట్స్ పైకి..
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 03, 2021 | 3:16 PM

Nikhil Karthikeya 2 Movie Update: విభిన్న కథలతో కూడిన సినిమాలతో నటిస్తూ మంచి గుర్తింపు పొందాడు యంగ్ హీరో నిఖిల్. ఇక నిఖిల్ చందు మొండేటి డైరెక్షన్లో ‘కార్తికేయ 2′ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. నిఖిల్ కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ ఇది. దీంతో ఈ మూవీ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. లాక్ డౌన్ ప్రభావంతో ఆగిపోయింది. ప్రస్తుతం నిఖిల్ ’18 పేజేస్’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నాడు.

ఈ క్రమంలోనే ‘కార్తికేయ 2’ మూవీ స్టార్ట్ కావడానికి కాస్త ఆలస్యమయినట్లుగా తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీని స్టార్ట్ చేయాడానికి ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ నెలలో లేదా వచ్చే నెలలో ఈ మూవీని సెట్స్ పైకీ తీసుకెళ్లెందుకు సన్నాహాలు చేస్తున్నారట మేకర్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టి.జీ. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

Also Read:

Balakrishna New Movie Update: ‘క్రాక్’ దర్శకుడికి ఓకే చెప్పిన బాలకృష్ణ.. సమ్మర్‏లో షూటింగ్ స్టార్ట్ ?

త్వరలో పెళ్ళిపీటలెక్కబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో.. ఆ అమ్మాయితోనే వివాహం.. వాస్తవమేనా ?