AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagarjuna’s ‘Bangarraju’ : బరిలోకి ‘బంగార్రాజు’.. త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనున్న కింగ్ నాగార్జున

కింగ్ నాగార్జున నటించిన 'సోగ్గాడే చిన్నినాయన' సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో 'బంగార్రాజు' గా నాగ్ అందరిని ఆకట్టుకున్నారు. ఇక ఇదే పాత్ర ఆదారంగా  మరో సినిమాను తెరకెక్కించాలని దర్శకుడు కళ్యాణ్,

Nagarjuna's 'Bangarraju' : బరిలోకి 'బంగార్రాజు'.. త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనున్న కింగ్ నాగార్జున
Rajeev Rayala
|

Updated on: Feb 03, 2021 | 4:31 PM

Share

Nagarjuna’s ‘Bangarraju’ :  కింగ్ నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో ‘బంగార్రాజు’ గా నాగ్ అందరిని ఆకట్టుకున్నారు. ఇక ఇదే పాత్ర ఆదారంగా  మరో సినిమాను తెరకెక్కించాలని దర్శకుడు కళ్యాణ్, నాగార్జున భావించారు. ఈ సినిమాకు ‘బంగార్రాజు’ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. కానీ అనేక కారణాలవల్ల ఈ సినిమా సెట్స్ పైకి  వెళ్ళలేదు. ఇదిగో స్టార్ట్ అవుతుంది అదిగో మొదలవుతుంది అంటూ ఆ మధ్య వార్తలు వినిపించాయి. సోగ్గాడే చిన్నినాయనా సినిమా తర్వాత నాగచైతన్య తో ‘రారండోయ్ వేడుక చూదాం’ రవితేజతో ‘నెల టికెట్’ సినిమా చేసాడు కళ్యాణ్. ఇప్పుడు నాగార్జున ‘బంగార్రాజు’ను ఎలాగైన పూర్తి చేయాలని చూస్తున్నాడు.

తాజాగా మరోసారి ఈ సినిమాకు సంబంధించిన వార్త ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా షూటింగ్ ను త్వరలోనే మొదలు పెట్టనున్నారట. ఫిబ్రవరి రెండో వారంలో ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నారని తెలుస్తుంది. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు. బంగార్రాజు మూవీ గతేడాది ఉగాదికే ప్రారంభం కావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసాడట దర్శకుడు కళ్యాణ్. ఈ సినిమాలో నాగ్, రమ్యకృష్ణలతో పాటు నాగచైతన్య మరో పాత్రలో నటించనున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

అంత‌రించిపోతున్న హ‌స్త క‌ళ‌ల నేప‌థ్యంలో రానున్న ‘రాధాకృష్ణ‌’… చిత్రయూనిట్‌కు అభినందనలు తెలిపిన తెలంగాణ మంత్రి…

Rajasekhar – Jeevitha : సతీమణి దర్శకత్వంలో సీనియర్ హీరో.. మరోసారి రాజశేఖర్‌ను డైరెక్ట్ చేయనున్న జీవిత..!

Follow Us
పిక్నిక్ వచ్చిన లేడీస్.. కార్ వెనుక అదిరిపోయే సెటప్.. కట్‌చేస్తే
పిక్నిక్ వచ్చిన లేడీస్.. కార్ వెనుక అదిరిపోయే సెటప్.. కట్‌చేస్తే
50 సినిమాల్లో ఒకే హీరోతో 40కి పైగా సినిమాలు.. కట్ చేస్తే
50 సినిమాల్లో ఒకే హీరోతో 40కి పైగా సినిమాలు.. కట్ చేస్తే
శని నక్షత్రం మారుతోంది.. ఈ 4 రాశుల లైఫ్‌లో టఫ్ టైమ్ స్టార్ట్!...
శని నక్షత్రం మారుతోంది.. ఈ 4 రాశుల లైఫ్‌లో టఫ్ టైమ్ స్టార్ట్!...
ఈసారి పదో తరగతి ఫలితాల్లో గరిష్ట ఉత్తీర్ణత.. ఇకపై ఫెయిల్ ఉండదు
ఈసారి పదో తరగతి ఫలితాల్లో గరిష్ట ఉత్తీర్ణత.. ఇకపై ఫెయిల్ ఉండదు
ఇకపై డోర్‌ క్లోజ్ అయినా.. మీరు వందేభారత్‌ ఎక్కవచ్చు.. ఎలా అంటే?
ఇకపై డోర్‌ క్లోజ్ అయినా.. మీరు వందేభారత్‌ ఎక్కవచ్చు.. ఎలా అంటే?
అమలులోకి కొత్త ఈవీ పాలసీ.. ఎప్పటినుంచంటే..?
అమలులోకి కొత్త ఈవీ పాలసీ.. ఎప్పటినుంచంటే..?
Team India: దమ్మున్నోడిని పక్కనపెట్టి, దద్దమ్మలను ఆడిస్తారా..
Team India: దమ్మున్నోడిని పక్కనపెట్టి, దద్దమ్మలను ఆడిస్తారా..
అమర్‌నాథ్ యాత్రకి వెళ్తున్నారా? ఈ వస్తువులు లేకపోతే అనుమతి కూడా..
అమర్‌నాథ్ యాత్రకి వెళ్తున్నారా? ఈ వస్తువులు లేకపోతే అనుమతి కూడా..
ఇంట్లో మిరపకాయల చెట్టు ఉండకూడదా? పండితులు ఏం చెబుతున్నారంటే?
ఇంట్లో మిరపకాయల చెట్టు ఉండకూడదా? పండితులు ఏం చెబుతున్నారంటే?
అమానుషం.. బైక్‌కు తాళ్లతో కట్టి ఉన్న మామ, అల్లుడి మృతదేహాలు!
అమానుషం.. బైక్‌కు తాళ్లతో కట్టి ఉన్న మామ, అల్లుడి మృతదేహాలు!