Naga Chaitanya: నాగచైతన్య వెబ్ సిరీస్‌పై లేటెస్ట్ అప్‌డేట్… స్ట్రీమింగ్ అప్పటి నుంచేనా.?
అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తోన్న విషయం తెలిసిందే. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. వెబ్ సిరీస్ చిత్రీకరణ ప్రారంభ సమయంలో చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసింది. అయితే ఆ తర్వాత ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్ రాలేదు. షూటింగ్ పూర్తయిందన్న వార్తలు వచ్చాయి కానీ ఇప్పటి వరకు వెబ్ సిరీస్...
ఒకప్పుడు వెబ్ సిరీస్‌లు అంటే కేవలం చిన్న చిన్న తారలకే పరిమితం అయ్యేది. అయితే ఆ తర్వాత బడా నిర్మాణ సంస్థలు వెబ్ సిరీస్ మేకింగ్‌లోకి అడుగుపెట్టడంతో బడా నటీనటులు వెబ్ సిరీస్‌లో నటించడం ప్రారంభించారు. రెగ్యులర్ సినిమాలతో సమానంగా వెబ్ సిరీస్‌లు తెరకెక్కాయి. అదే స్థాయిలో రెవెన్యూ సైతం కొల్లగొడుతున్నాయి. దీంతో బడా హీరోలు సైతం వెబ్ సిరీస్‌లో నటించేందుకు ముందుకొస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య ధూత వెబ్ సిరీస్‌లో నటిస్తోన్న విషయం తెలిసిందే. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. వెబ్ సిరీస్ చిత్రీకరణ ప్రారంభ సమయంలో చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసింది. అయితే ఆ తర్వాత ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్ రాలేదు. షూటింగ్ పూర్తయిందన్న వార్తలు వచ్చాయి కానీ ఇప్పటి వరకు వెబ్ సిరీస్ విడుదలకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. హార్రర్ జానర్‌లో తెరకెక్కుతోన్న ఈ వెబ్ సిరీస్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఈ వెబ్ సిరీస్‌ను విడుదల చేయనున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ ధూత వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైందని తెలుస్తోంది. అక్టోబర్ నెలలో ధూత వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న వెబ్ సిరీస్, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ ఇది వరకే ప్రకటించారు.
ధూత వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌కు సంబంధించి రెండు, మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. సూపర్ నేచురల్ పవర్స్ నేపథ్యంలో, ఒక వైవిధ్య కథాంశంతో ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. నార్ట్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌తో కలిసి అమెజాన్ ఒరిజినల్స్ ఈ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించింది. ఈ సినిమాలో పార్వతి, ప్రియాభవాని శంకర్, తరుణ్ భాస్కర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌కు సంబంధించిన వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..