- Telugu News Photo Gallery Cinema photos Ram Charan Game changer movie may exceed budget according to reports
Game Changer: రామ్ చరణ్ మార్కెట్‌ను మించి గేమ్ ఛేంజర్.. బడ్జెట్ అదుపు తప్పుతుందా ??
గేమ్ ఛేంజర్ బడ్జెట్ అదుపు తప్పుతుందా..? ఒక్కో సినిమాకు అన్నేసి జాగ్రత్తలు తీసుకునే దిల్ రాజుకు కూడా శంకర్ లెక్కలు అంతు చిక్కడం లేదా..? రామ్ చరణ్ మార్కెట్‌ను మించి గేమ్ ఛేంజర్ ఖర్చు ఔట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుందా..? అసలేం జరుగుతుంది ఈ చిత్ర విషయంలో..? అసలు షూటింగ్ ఎంతవరకు వచ్చింది..? శంకర్‌తో సినిమా అన్నపుడే లేట్ అవుతుందని ఊహించారు రామ్ చరణ్. కానీ ఇంత ఆలస్యమవుతుందని మాత్రం ఆయన కూడా అనుకోలేదు.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Sep 15, 2023 | 8:29 PM

గేమ్ ఛేంజర్ బడ్జెట్ అదుపు తప్పుతుందా..? ఒక్కో సినిమాకు అన్నేసి జాగ్రత్తలు తీసుకునే దిల్ రాజుకు కూడా శంకర్ లెక్కలు అంతు చిక్కడం లేదా..? రామ్ చరణ్ మార్కెట్‌ను మించి గేమ్ ఛేంజర్ ఖర్చు ఔట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుందా..? అసలేం జరుగుతుంది ఈ చిత్ర విషయంలో..? అసలు షూటింగ్ ఎంతవరకు వచ్చింది..?

శంకర్‌తో సినిమా అన్నపుడే లేట్ అవుతుందని ఊహించారు రామ్ చరణ్. కానీ ఇంత ఆలస్యమవుతుందని మాత్రం ఆయన కూడా అనుకోలేదు. గేమ్ ఛేంజర్ అనుకున్న దానికంటే లేట్ అవుతుంది..

అదొక్కటే కాదు దీనికి బడ్జెట్ ఇష్యూస్ మొదలైనట్లు తెలుస్తుంది. దాదాపు 350 కోట్ల వరకు ఈ సినిమాకు ఖర్చవుతున్నట్లు ట్రేడ్ అంచనా. శంకర్ సినిమా అంటే బడ్జెట్ కచ్చితంగా పెరుగుతుందని తెలుసు.. అందుకే దిల్ రాజు గేమ్ ఛేంజర్ కోసం ఏకంగా 250 కోట్లు అనుకున్నారు.

ఎలాగూ చరణ్‌కు గ్లోబల్ మార్కెట్ ఉంది కాబట్టి ఆ బడ్జెట్ వర్కవుట్ అవుతుందని లెక్కలేసుకున్నారు దిల్ రాజు. కానీ దానికి మరో 100 కోట్లు అదనంగా అవుతుందనే ప్రచారం జరుగుతుంది.

సాధారణంగా బడ్జెట్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండే దిల్ రాజుకు కూడా శంకర్ లెక్కలు అర్థం కావట్లేదు. గేమ్ ఛేంజర్ కొత్త షెడ్యూల్ సెప్టెంబర్ మూడో వారంలో మొదలు కానుంది. అన్నీ బానే ఉన్నా.. బడ్జెట్ దగ్గరే అసలు సమస్యలు వస్తున్నాయి. మరి దీన్ని దిల్ రాజు తన మాస్టర్ మైండ్‌తో ఎలా ఓవర్ కమ్ చేస్తారో చూడాలి. కియారా అద్వానీ ఇందులో చరణ్‌కు జోడీగా నటిస్తున్నారు.





























