AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 3: పుష్ప3 ప్రాజెక్ట్‌ కన్ఫామ్‌.. టైటిల్‌ ఏంటో తెలుసా.?

పుష్ప2 సినిమా విడుదలకు కౌంట్‌ డౌన్‌ మొదలైంది. మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో అటు అభిమానులే కాకుండా సినిమా ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా పుష్ప పార్ట్‌3కి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది..

Pushpa 3: పుష్ప3 ప్రాజెక్ట్‌ కన్ఫామ్‌.. టైటిల్‌ ఏంటో తెలుసా.?
Pushpa
Narender Vaitla
|

Updated on: Dec 03, 2024 | 4:24 PM

Share

ప్రస్తుతం యావత్‌ ఇండియన్‌ సినీ లవర్స్‌ పుష్ప2 సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 5వ తేదీ ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోందీ మూవీ. విడుదలకు ముందే రికార్డులను తిరగరాయడం మొదలు పెట్టిన పుష్ప2, థియేటర్లలోకి వచ్చాక ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందోనని అటు ఫ్యాన్స్‌తోపాటు సినీ క్రిటిక్స్‌ సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే ఓవర్‌సీస్‌తో పాటు, ఇండియాలో అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డులను తిరగరాసింది పుష్ప2. కాగా పుష్ప2 విడుదలకు ముందే పుష్ప3 చిత్రానికి సంబంధించి వార్తలు వస్తున్నాయి. కచ్చితంగా పుష్ప ఫ్రాంచైజీ నుంచి మరో సినిమా ఉండనుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. బెర్లిన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో అల్లు అర్జున్‌ స్పందిస్తూ.. పుష్ప ‘పార్ట్‌3’ ఉంటుందని తెలిపారు. ‘పుష్ప2’ క్లైమాక్స్‌లో ‘పార్ట్‌-3’కి లీడ్‌ ఇస్తూ కొన్ని సన్నివేశాలను చూపించనున్నారని వార్తలు వచ్చాయి.

ఇక తాజాగా సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ దర్శకుడు సుకుమార్‌ పార్ట్‌ 3 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అభిమానులను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ.. ‘నేను మీ హీరోని మూడేళ్లు కష్టపెట్టాను. మీరు మీ హీరోని అడగండి. నేను నా ఫ్రెండ్‌ (అల్లు అర్జున్‌)ను అడుగతాను. నా కోసం మళ్లీ మరో మూడేళ్లు ఇస్తే తప్పకుండా ‘పుష్ప3’ చేస్తా’ అని చెప్పుకొచ్చాడు.

పుష్ప2 ట్రైలర్‌..

అయితే తాజాగా సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోన్న ఓ ఫొటో పుష్ప3 ఉంటుందన్న వార్తలకు బలం చేకూర్చింది. ఈ సినిమాకు సౌండ్‌ ఇంజినీర్‌గా ఆస్కార్‌ అవార్డు విజేత రసూల్‌ పూకుట్టి పనిచేశారు. ఆయన తన టీమ్‌తో కలిసి దిగిన ఫొటో వెనుక ‘పుష్ప3’ టైటిల్‌ ఉంది. అందులో ‘పుష్ప3: ది ర్యాంపేజ్‌’ అని ఉంది. దీంతో పుష్ప2లో కచ్చితంగా పార్ట్‌కి సంబంధించిన హింట్‌ ఉండబోతోందని స్పష్టమవుతోంది.

Pushpa3

అయితే పుష్ప3 రావడానికి కచ్చితంగా సమయం పడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పుష్ప2 విడుదల తర్వాత సుకుమార్‌, అల్లుఅర్జున్‌ ఇద్దరూ వేరువేరు ప్రాజెక్ట్స్‌లో బిజీ అవుతుండడంతో కనీసం రెండు నుంచి మూడేళ్లయినా పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే మొత్తం మీద పుష్ప యూనివర్స్‌ కొనసాగడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..