AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chhatrapati Shivaji: ఛత్రపతి శివాజీగా పాన్ ఇండియా హీరో.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం 'ఛత్రపతి శివాజీ మహారాజ్‌'. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమా రూపొందనుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైంది.

Chhatrapati Shivaji: ఛత్రపతి శివాజీగా పాన్ ఇండియా హీరో.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
Chhatrapati Shivaji Maharaj
Basha Shek
|

Updated on: Dec 03, 2024 | 4:40 PM

Share

కాంతారా సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు రిషబ్ శెట్టి. ఇప్పుడు ఈ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ కు కన్నడతో పాటు తెలుగు, హిందీ భాషల నుంచి భారీ బడ్జెట్ సినిమా అవకాశాలు వస్తున్నాయి. పొరుగు సినిమా దర్శకులు, నిర్మాతలు రిషబ్ శెట్టి కోసం కథలు రాసుకుంటున్నారు. ఇప్పటికే తెలుగులో ‘జై హనుమాన్’ సినిమాలో నటిస్తున్నాడీ పాన్ ఇండియా స్టార్. ఇప్పుడు ఓ హిస్టారికల్ వ్యక్తి కథతో తెరకెక్కనున్న బాలీవుడ్ సినిమాలోనూ భాగమయ్యాడు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ పాత్రలో రిషబ్ శెట్టి నటిస్తున్నారు. హిందీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు సందీప్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఛత్రపతి శివాజీ పాత్రలో రిషబ్ శెట్టి మెరిసిపోతున్న ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ మంగళవారం (డిసెంబర్ 03) విడుదలైంది. ఈ చిత్రానికి ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రం గురించి రిషబ్ శెట్టి మాట్లాడుతూ, ‘, ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్’ చిత్రాన్ని దర్శకుడు సందీప్ సింగ్ తెరకెక్కించనున్నారు. ఇందులో ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్ర ఎంత అద్భుతంగా ఉంటుందంటే, కథ విన్న క్షణంలో దాని గురించి ఆలోచించకుండానే ప్రేమలో పడ్డాను. ఛత్రపతి శివాజీగా నటించడం అంటే మాటల్లో చెప్పలేని గౌరవం. ఛత్రపతి శివాజీ మహారాజ్ శతాబ్దాలను ప్రభావితం చేసిన జాతీయ వీరుడు. ఇంత అద్భుతమైన హీరో పాత్రకు జీవం పోయడం నాకు లభించిన అపూర్వమైన అవకాశం, గౌరవం’ అన్నారు.

ఇవి కూడా చదవండి

దర్శకుడు సందీప్ సింగ్ మాట్లాడుతూ, ‘ఛత్రపతి శివాజీ పాత్రకు రిషబ్ శెట్టి మాత్రమే నా ఎంపిక. ఆ పాత్ర కోసం ఇంకెవరినీ ఊహించుకోలేదు. ఈ సినిమాకు దర్శకత్వం వహించాలనేది చాలా ఏళ్లుగా నా కోరిక. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితాన్ని తెరపైకి తీసుకురావడం నాకు చాలా ముఖ్యమైనది. గౌరవప్రదమైన విషయం. ఈ సినిమా సాంకేతికత భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి పెంచుతుంది.

మరాఠా యోధుడిగా రిషబ్ ..

‘ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్’ చిత్రం జనవరి 21, 2027న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్ర దర్శకుడు సందీప్ సింగ్ అక్షయ్ కుమార్ నటించిన రౌడీ రాథోడ్, దీపిక-రణ్‌వీర్ నటించిన రామ్ లీలా మరియు ప్రియాంక నటించిన మేరీ కోమ్ చిత్రాలను కూడా నిర్మించారు. ఆ తర్వాత ఐశ్వర్యరాయ్‌ నటించిన ‘సరబ్‌జీత్‌’, అమితాబ్‌ బచ్చన్‌ నటించిన ‘జండ్‌’, ‘పీఎం నరేంద్ర మోదీ’, ‘మే అటల్‌ హూ’ వంటి మరికొన్ని సినిమాలను రూపొందించాడు. ఇప్పుడు ‘ఛత్రపతి శివాజీ మహారాజ్’ చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం వహించనున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.