AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Vijay: ఆరోజు విజయ్, నేను చనిపోయేవాళ్లం.. అదృష్టం కొద్దీ.. ఆసక్తికర విషయం చెప్పిన గబ్బర్ సింగ్ విలన్

తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు టీవీకే విజయ్ గురించి గబ్బర్ సింగ్ విలన్, నటుడు అభిమాన్యు సింగ్ ఆసక్తికర విషయం పంచుకున్నాడు. ఒక రోజు సినిమా షూటింగ్ లో ఏమాత్రం తేడా జరిగినా విజయ్, నేను చనిపోయే వాళ్లమని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

CM Vijay: ఆరోజు విజయ్, నేను చనిపోయేవాళ్లం.. అదృష్టం కొద్దీ.. ఆసక్తికర విషయం చెప్పిన గబ్బర్ సింగ్ విలన్
CM Vijay, Abhimanyu Singh
Basha Shek
|

Updated on: May 26, 2026 | 8:33 PM

Share

అభిమాన్యుసింగ్.. పేరు చెబితే చాలా మంది గుర్తు పట్టకపోవచ్చు కానీ గబ్బర్ సింగ్ విలన్ అంటే ఇట్టే గుర్తు పడతారు. రక్త చరిత్ర సినిమాలతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించిన ఈ విలన్ పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. నేను నా రాక్షసి, బాడీ గార్డ్, బెజవాడ, ముకుంద, పండగ చేస్కో, జై లవకుశ, ఆక్సిజన్, అమర్ అక్బర్ ఆంటోనీ తదితర సినిమాల్లో పవర్ ఫుల్ విలన్ గా చేశాడు. తెలుగులోనే కాదు హిందీ, తమిళం, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేశాడు అభిమన్యు సింగ్. స్టార్ హీరోలకు పోటీగా ప్రతినాయకుడి పాత్రల్లో ఆకట్టుకున్నారు. అలా అభిమన్యు సింగ్ తమిళనాడు సీఎం విజయ్ నటించిన సూపర్ హిట్ మూవీ వేలాయుధం లోనూ విలన్ గా అదరగొట్టాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ విలన్ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అలాగే సీఎం విజయ్ తో కలిసి నటించిన క్షణాలను మరోసారి గుర్తు చేసుకున్నాడు.

‘తమిళంలో నా మొదటి సినిమా విజయ్‌ దళపతి హీరోగా నటించిన వేలాయుధం. ఈ సినిమాలోని ఓ ఫైట్‌ సీన్‌ కోసం మేము సుమారు ఆరు గంటలపాటు ప్రయాణించి కోయంబత్తూరు వెళ్లాం. అక్కడినుంచి సుమారు గంటన్నరపాటు ప్రయాణిస్తే ఒక చిన్న రైల్వే స్టేషన్‌ వస్తుంది. అక్కడే మా షూటింగ్‌ స్పాట్. ఇందుకోసం అప్పటికే ఒక రైలును ముందుగానే రెడీ చేసి పెట్టారు. మొత్తం ఆరు రోజుల పాటు అక్కడ షూట్ జరిగింది. ఏడో రోజు రైలుపై నాకు విజయ్ కు ఫైట్ సీన్స్ షూట్ చేయాల్సి ఉంది. కాబట్టి రైలు పట్టాలపై ఆగి ఉన్నప్పుడు దానిపై ఎక్కి విజయ్‌, నేను రిహార్సల్స్‌ చేశాం. కెమెరా ఆన్‌ చేయగానే రైలు కదులుతుందన్నారు. ఉన్నట్లుండి నాకు భయమేసింది. కదిలే ట్రైన్‌పై మనమెలా ఫైట్‌ చేయగలమని విజయ్ ను అడిగాను. అందుకతను.. మనం పోట్లాడుకోం, ఒకరినొకరు కాపాడుకుంటాం అని బదులిచ్చాడు. చూస్తుండగానే రైలు 70-80 కి.మీ స్పీడ్ అందుకుంది. మా ఇద్దరితోపాటు కెమెరామెన్‌ ఒక్కడే ఉన్నాడు. ఇంతలో ఎదురుగా ఒక బ్రిడ్జి కనిపించింది. అంతే.. నా గుండె అరచేతిలోకి వచ్చింది. ఏదైనా తేడా జరిగి కాలు జారితే 2500 అడుగుల లోయలో పడి చనిపోవడం ఖాయం. విజయ్‌ ప్రాణాలకు కూడా ప్రమాదం పొంచి ఉంది. అయితే అదృష్టవశాత్తూ అలాంటిదేం జరగలేదు. విజయవంతంగా షూట్‌ పూర్తి చేశాం. కానీ ఈ షూట్ తర్వాత నాకు వారం రోజులపాటు సరిగా నిద్రపట్టలేదు. ఏదైనా జరగరానిది జరిగి ఉంటే అన్న ఊహే నా వెన్నులో వణుకు పుట్టించింది. ఏదేమైనా ఆరోజు చావు అంచుల నుంచి మేమిద్దరం తప్పించుకున్నాం’ అని అభిమన్యు సింగ్‌ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ నటుడి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఆరోజు విజయ్, నేను చనిపోయేవాళ్లం.. ఆసక్తికర విషయం చెప్పిన విలన్
ఆరోజు విజయ్, నేను చనిపోయేవాళ్లం.. ఆసక్తికర విషయం చెప్పిన విలన్
అరటి తొక్కతో అందం రెట్టింపు! ఇలా వాడితే వారం రోజుల్లోనే మిరాకిల్
అరటి తొక్కతో అందం రెట్టింపు! ఇలా వాడితే వారం రోజుల్లోనే మిరాకిల్
కష్టం విలువ తెలిసినోడు సార్.. డబ్బుకు ఆశ పడడు..!
కష్టం విలువ తెలిసినోడు సార్.. డబ్బుకు ఆశ పడడు..!
ఒకేసారి ఏడు గ్రహాలు.. వీరికి ఇక వాయింపే వాయింపు
ఒకేసారి ఏడు గ్రహాలు.. వీరికి ఇక వాయింపే వాయింపు
పోలీస్ స్టేషన్‌లో మందు మజా.. నిందితుడితో ఖాకీ సిట్టింగ్ కలకలం..
పోలీస్ స్టేషన్‌లో మందు మజా.. నిందితుడితో ఖాకీ సిట్టింగ్ కలకలం..
ప్లేఆఫ్స్‌లో కోహ్లీ సరికొత్త రికార్డు.. ధోనీ, రోహిత్ సరసన కోహ్లీ
ప్లేఆఫ్స్‌లో కోహ్లీ సరికొత్త రికార్డు.. ధోనీ, రోహిత్ సరసన కోహ్లీ
'కరుప్పు' సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
'కరుప్పు' సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
వారం రోజుల్లో సీఎంగా సిద్ధరామయ్య రాజీనామా! కొత్త సీఎం ఎవరంటే?
వారం రోజుల్లో సీఎంగా సిద్ధరామయ్య రాజీనామా! కొత్త సీఎం ఎవరంటే?
గూగుల్ జెమిని, చాట్‌జీపీటీలను ఇవి అడుగుతున్నారా.. మీ పని ఖతమే
గూగుల్ జెమిని, చాట్‌జీపీటీలను ఇవి అడుగుతున్నారా.. మీ పని ఖతమే
ప్రియుడి చేతితో వివాహిత మృతి.. పోలీసుల విచారణతో విస్తుపోయే నిజాలు
ప్రియుడి చేతితో వివాహిత మృతి.. పోలీసుల విచారణతో విస్తుపోయే నిజాలు