12 Years for Magadheera : రాజమౌళిని దర్శకధీరుడిగా.. రామ్ చరణ్‌‌‌‌ను స్టార్ హీరోగా మార్చిన మగధీరకు 12 ఏళ్ళు..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో బిగెస్ట్ హిట్‌‌‌గా నిలిచిన మగధీర. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా విడుదలై 12 ఏళ్ళు అవుతోంది. రామ్ చరణ్- కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఈ సినిమాను..

12 Years for Magadheera : రాజమౌళిని దర్శకధీరుడిగా.. రామ్ చరణ్‌‌‌‌ను స్టార్ హీరోగా మార్చిన మగధీరకు 12 ఏళ్ళు..
Magadheera Movie
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 31, 2021 | 11:33 AM

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో బిగెస్ట్ హిట్‌‌‌గా నిలిచిన మగధీర. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా విడుదలై 12 ఏళ్ళు అవుతోంది. రామ్ చరణ్- కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఈ సినిమాను గీత ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మించారు. పూర్వ జన్మల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు డిఫరెంట్ రోల్స్‌‌‌‌లో కనిపించరు. కాలభైరవగా..హర్ష అనే రెండు పాత్రల్లో కనిపించడు చరణ్. అలాగే కాజల్ మిత్రవిందగా.. ఇందు గా కనిపించి ఆకట్టుకుంది.  ఇక చందమామ కాజల్ అగర్వాల్ ఈ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. ఈ సినిమా తర్వాత కాజల్ కు తెలుగులో ఆఫర్లు క్యూ కట్టాయి.  భారీ సెట్టింగ్స్‌‌‌‌తో విజువల్ వండర్‌‌‌‌గా తెరకెక్కిన మగధీర సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. అప్పటివరకు ఉన్న రికార్డ్‌‌‌‌ను ఈ సినిమా తిరగరాసింది.

అప్పటి వరకు మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా 40కోట్లు వసూల్ చేసి నెంబర్ వన్‌‌‌‌గా కంటిన్యూ అవుతుంది. సరిగ్గా అదే సమయంలో వచ్చిన మగధీర సినిమా40కోట్ల వసూల్‌‌‌‌ను అవలీలగా దాటేసింది. ఈ చిత్రం 2009లోనే 80 కోట్ల‌కు పైగా షేర్ వ‌సూలు చేసి రాజ‌మౌళి రేంజ్ ఏంటో చూపించింది. తెలుగు సినిమా రేంజ్ కూడా మగధీర మార్చేసింది. ఎస్.ఎస్.రాజమౌళి తన దర్శక ప్రతిభ ఏపాటిదో ఈ చిత్రంతో మరోసారి నిరూపించారు. ఇక ఈ సినిమా 12 ఏళ్లూపూర్తి చేసుకున్న సందర్భంగా రామ్ చరణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాను ట్రెండ్ చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన పోస్టర్లను షేర్ చేస్తూ తెగ హడావిడి చేస్తోన్నారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు చరణ్. ఇదిలా ఉంటే ఇటీవల మగధీర సినిమాకు సీక్వెల్ రాబోతుందంటూ వార్తలు వినిపించాయి. ఈ వార్తల పై క్లారిటీ అయితే రాలేదు కానీ అభిమానులు మాత్రం ఈ సినిమాకు సీక్వెల్ రావాలని కోరుకుంటున్నారు. మరి అభిమానుల కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Nabha Natesh: లక్కీ ఛాన్స్ కొట్టేసిన ఇస్మార్ట్ బ్యూటీ.. బాలీవుడ్ బడా హీరో సరసన నభానటేష్..

Venu Aravind: టీవీ సీనియర్ యాక్టర్ వేణు అరవింద్ ఆరోగ్య పరిస్థితి విషమం అంటూ వార్తలు.. స్పందించిన రాధిక

Shilpa Shetty: మా ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారు.. వాటిని నిరోధించండి.. ముంబై హైకోర్టులో శిల్పాశెట్టి పిటిషన్

అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!
50 MP ట్రిపుల్ కెమెరా.. అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో స్మార్ట్ ఫోన్
50 MP ట్రిపుల్ కెమెరా.. అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో స్మార్ట్ ఫోన్