పది రోజులు మౌనం.. ఇదే నా బర్త్‌డే గిఫ్ట్
తన పుట్టినరోజుకు తానే గిఫ్ట్‌లు ఇచ్చుకునే బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ ఈ సారి కూడా ఓ గొప్ప బహుమతి ఇచ్చుకుంటోంది. యోగాలో భాగంగా పది రోజులు మౌనంగా ఉండబోతుంది ఈ బ్యూటీ. ఈ విషయాన్ని ఆమే స్వయంగా తెలిపింది. ‘‘16-17 సంవత్సరాల వయసు నుంచే నేను యోగా సాధన చేస్తున్నా. ఇప్పుడు అడ్వాన్స్‌డ్ యోగా నేర్చుకుంటున్నా. పది రోజులు మౌనం అన్నది చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ నా పుట్టినరోజు గిఫ్ట్‌గా ఈ సంవత్సరం […]

తన పుట్టినరోజుకు తానే గిఫ్ట్‌లు ఇచ్చుకునే బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ ఈ సారి కూడా ఓ గొప్ప బహుమతి ఇచ్చుకుంటోంది. యోగాలో భాగంగా పది రోజులు మౌనంగా ఉండబోతుంది ఈ బ్యూటీ. ఈ విషయాన్ని ఆమే స్వయంగా తెలిపింది.
‘‘16-17 సంవత్సరాల వయసు నుంచే నేను యోగా సాధన చేస్తున్నా. ఇప్పుడు అడ్వాన్స్‌డ్ యోగా నేర్చుకుంటున్నా. పది రోజులు మౌనం అన్నది చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ నా పుట్టినరోజు గిఫ్ట్‌గా ఈ సంవత్సరం ఈ బహుమతిని ఇచ్చుకుంటున్నా’’ అంటూ కంగనా పేర్కొంది. కాగా ఇందుకోసం కంగనా తమిళనాడులోని కోయంబత్తూర్‌కు వెళ్లనుంది. రోజు దాదాపు 10- 15 గంటల పాటు తాను యోగాలో ఉంటానని ఆ సమయంలో ఫోన్ కూడా తనకు అందుబాటులో ఉండదని ఆమె తెలిపింది. ఇక ఈ అడ్వాన్స్‌డ్ యోగాలో భంగిమలు నేర్చుకునేందుకు ఆరు నెలలు కసరత్తులు చేసినట్లు ఆమె తెలిపింది.
కాగా ఈ యోగాను పూర్తి చేసుకోనున్న కంగనా.. ఆ తరువాత తన కుటుంబంతో పుట్టినరోజును జరుపుకోనుంది. అనంతరం అశ్విన్ అయ్యర్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కనున్న పంగాలో నటించనుంది. ఈ చిత్రంలో ఆమె కబడ్డీ ప్లేయర్‌గా కనిపించనుంది. మే నెలలో ఈ మూవీ షూటింగ్ పూర్తి కానుంది.