WB Poll 2021: ఎన్నికల ప్రచారంలో TMC ఎంపీ నుస్రత్ జహాన్ అసహనం…బీజేపీ చేతిలో అస్త్రం..Video

West Bengal Election 2021: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్న నందిగ్రామ్‌లో గంటకు మించి ఎన్నికల ప్రచారం చేయలేనంటూ తృణాముల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ అసహనం వ్యక్తంచేస్తున్న వీడియో వైరల్ గా మారింది.

WB Poll 2021: ఎన్నికల ప్రచారంలో TMC ఎంపీ నుస్రత్ జహాన్ అసహనం...బీజేపీ చేతిలో అస్త్రం..Video
TMC MP Nusrat Jahan
Follow us
Janardhan Veluru

|

Updated on: Mar 29, 2021 | 3:45 PM

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఘట్టం రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే తొలి విడత పోలింగ్ పూర్తికాగా…రెండో విడత పోలింగ్ ఏప్రిల్ 1న జరగనుంది. అధికార తృణాముల్ కాంగ్రెస్, బీజేపీల మధ్య గట్టి పోటీ నెలకొంటోంది. ప్రచారఘట్టంలో పైచేయి సాధించేందుకు ఇరు పార్టీలు సోషల్ మీడియా వేదికగానూ పరస్పరం విరుచుకపడుతున్నాయి.  రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేసేందుకు  తమకు దక్కిన ఏ ఒక్క అవకాశాన్నీ జారవిడుచుకోవడం లేదు. ఈ నేపథ్యంలో తృణాముల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్‌కు సంబంధించిన ఓ వీడియో బీజేపీ చేతిలో అస్త్రంగా మారింది. ఈ వీడియోలో నుస్రత్ జహాన్ నందిగ్రామ్ ఎన్నికల ప్రచారంలో సహనాన్ని కోల్పోయి దురుసుగా వ్యవహరిస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. గంటకుపైగా ఎన్నికల ప్రచారం నిర్వహించలేనంటూ నుస్రత్ అసహనం వ్యక్తంచేస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. సీఎం కోసం కూడా ఇంతకు మించి చేయలేనంటూ ఆమె ప్రచార వాహనంపై నుంచి కిందకు దిగేశారు.

సమీపంలోని మెయిన్ రోడ్డు వరకు ప్రచారాన్ని కొనసాగించాలన్న స్థానిక టీఎంసీ నేతల అభ్యర్థనను నుస్రత్ జహాన్ తిరస్కరిస్తున్నట్లు ఈ వీడియోలు ఉంది. 25 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియోను బీజేపీ పశ్చిమ బెంగాల్ శాఖ తన ట్విట్టర్ ఖాతాలో విడుదల చేసింది. నందిగ్రామ్‌లో మమతా బెనర్జీ ఓడిపోతున్నారంటూ బీజేపీ కామెంట్ చేసింది. నుస్రత్ జహాన్ వ్యవహార తీరుకు సంబంధించిన ఈ వీడియో..తృణాముల్‌ను ఇబ్బందిపెట్టేందుకు బీజేపీ చేతిలో ప్రచారాస్త్రంగా మారింది. దీనిపై తృణాముల్ కాంగ్రెస్ ఎలా వ్యవహరిస్తుందో వేచిచూడాల్సిందే.

ఇవి కూడా చదవండి..West Bengal Election 2021: పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల సిత్రాలు.. 25శాతం అభ్యర్థులపై క్రిమినల్ కేసులు

నందిగ్రామ్ లో రెండు బలమైన ‘కొండలను’ ఢీకొననున్న చిట్టి అభ్యర్థి, వయస్సు 36 ఏళ్ళే !

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!