నందిగ్రామ్ లో దీదీ 8 కి.మీ. ‘వీల్ చైర్ యాత్ర’, ఎండలో తృణమూల్ కాంగ్రెస్, భద్రతా సిబ్బందిపాట్లు
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోమవారం నందిగ్రామ్ లో సుదీర్ఘ 'వీల్ చైర్ యాత్ర' చేపట్టారు. సుమారు 8 కిలో మీటర్ల దూరం ఇది సాగింది. కానీ అక్కడ దీన్ని 'పాదయాత్ర' గా వ్యవహరిస్తున్నారు. పూర్బా మేదినీ పూర్ జిల్లాలోని..
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోమవారం నందిగ్రామ్ లో సుదీర్ఘ ‘వీల్ చైర్ యాత్ర’ చేపట్టారు. సుమారు 8 కిలో మీటర్ల దూరం ఇది సాగింది. కానీ అక్కడ దీన్ని ‘పాదయాత్ర’ గా వ్యవహరిస్తున్నారు. పూర్బా మేదినీ పూర్ జిల్లాలోని నందిగ్రామ్ నియోజకవర్గానికి ఏప్రిల్ 1 న (రెండో దశలో) ఎన్నిక జరగనుంది. ఈ సందర్భంగా మమతా బెనర్జీ సోమవారం ఈ యాత్రని రేపార ఖుదీరాం ప్రాంతం నుంచి ఠాకూర్ చౌక్ వరకు వీల్ చైర్ లోనే కొనసాగించారు. మమతా బెనర్జీ జిందాబాద్ అంటూ వందల సంఖ్యలో స్థానికులు కూడా ఈ యాత్రలో పాల్గొన్నారు. గురువారం నాడు తాను ఉదయం పోలింగ్ మొదలైనప్పటి నుంచి సాయంత్రం ముగిసేవరకు ఈ నందిగ్రామ్ నియోజకవర్గంలోనే ఉంటానని మమత ప్రకటించారు.కాగా-హోమ్ మంత్రి అమిత్ షా మంగళవారం ఈ నియోజకవర్గాన్నీ సందర్శించి ఇక్కడ జరిగే రోడ్ షో లలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.
అటు మమత.. తన బీజేపీ ప్రత్యర్థి ఈ నియోజకవర్గ అభ్యర్థి సువెందు అధికారిపై విరుచుకపడ్డారు. ఇక్కడ తాను (అధికారి) గెలిచి తీరుతానని ఆయన అంటున్నారని, కానీ ఈ నియోజకవర్గ ఓటర్లకు ఎవరికీ ఓటు వేయాలో తెలుసునని ఆమె అన్నారు. తనపై 50 వేల ఓట్ల తేడాతో విజయం సాధిస్తానని ఆయన సవాల్ చేశారని, కానీ నేను మాత్రం ఎలాంటి సవాల్ చేయబోనని ఆమె వ్యాఖ్యానించారు. గెలుపు ఓటములను ప్రజలే నిర్ణయిస్తారన్నారు. ఇక బెంగాల్ లో ముఖ్యంగా బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల ప్రచారం జోరందుకుంటోంది. అనేక చోట్ల త్రిముఖ పోటీ ఉన్నా ప్రధాన పోటీ మాత్రం ఈ రెండు పార్టీల మధ్యే ఉంది. అటు. పలు చోట్ల పోలీసులు సోదాలు చేసి నాటు బాంబులను, నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు.
#WATCH | West Bengal Chief Minister Mamata Banerjee holds a ‘padyatra’ in Nandigram. pic.twitter.com/eOjiUoVWTm
— ANI (@ANI) March 29, 2021
మరిన్ని చదవండి ఇక్కడ : Glass Bridge: హాట్ టాపిక్‌గా మారిన చైనా లో మరో అద్భుత కట్టడం…!! తప్పక చూడాల్సిందే… ( వీడియో )
Viral Video: పాముపై ఊరేగిన కప్ప…!! స్నేహితులుగా మారిన ఆగర్భ శత్రువులు… ( వీడియో ) Prison island: సముద్రాల మధ్యలో ఉండే అందమైన ద్వీపం… షాకింగ్ నిజాలు…!! ( వీడియో )