Assembly Elections: బెంగాల్ దీదీదే.. తమిళనాట స్టాలిన్.. టైమ్స్ నౌ ఒపీనియన్ పోల్ రిజల్ట్స్

దేశంలో ఇపుడు ఎవరిని కదిపినా ఒక్కటే చర్చ. అయిదు అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికల్లో ఎవరి విజయావకాశాలు ఎలా వున్నాయి? ఏ పార్టీలు విజయం సాధించే అవకాశం వుంది? ఇదిప్పుడు హాట్ టాపిక్

Assembly Elections: బెంగాల్ దీదీదే.. తమిళనాట స్టాలిన్.. టైమ్స్ నౌ ఒపీనియన్ పోల్ రిజల్ట్స్
Follow us

|

Updated on: Mar 09, 2021 | 7:12 PM

Opinion Poll survey of five assembly elections: దేశంలో ఇపుడు ఎవరిని కదిపినా ఒక్కటే చర్చ. అయిదు అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికల్లో ఎవరి విజయావకాశాలు ఎలా వున్నాయి? ఏ పార్టీలు విజయం సాధించే అవకాశం వుంది? ఇలాంటి చర్చలు సర్వత్రా వినిపిస్తున్నాయి. నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ పాలక పార్టీలు అధికారాన్ని నిలబెట్టుకుంటాయా? లేక విపక్షాలు విజయం సాధిస్తాయా అన్నది చర్చ జరుగుతోంది. వాడీ వేడీ ప్రచారం ఓ వైపు కొనసాగుతుంటే కొన్ని జాతీయ మీడియా సంస్థలు ఒపీనియన్ పోల్ చేప్టటాయి. తాజాగా టైమ్స్ నౌ – సీ ఓటర్ సర్వే నివేదిక ఒకటి నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఈ ఒపీనియన్ పోల్ సర్వే అంశాలు ఇంటరెస్టింగ్‌గా మారాయి.

బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఒకప్పటి కమ్యూనిస్టుల కంచుకోట మెల్లిగా కాషాయ రంగు పులుముకుంటున్న సంకేతాల నేపథ్యంలో రెండు సార్లు అధికారంలో కొనసాగిన తృణమూల్ నుంచి పాలనా పగ్గాలను లాగేసుకుంటుందా? అన్న చర్చ ఆసక్తిని రేకెత్తిస్తోంది. బెంగాల్‌లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌, బీజేపీల మధ్య హోరాహోరీగా పోరు జరుగుతుందని టైమ్స్ నౌ – సీ ఓటర్ సర్వే నివేదిక చెబుతోంది. అయితే ఈ హోరాహోరీలో అధికార తృణమూల్ కొద్దిపాటి ఆధిక్యంతో అధికారాన్ని నిలబెట్టుకుంటుందని టైమ్స్ నౌ – సీ ఓటర్ సర్వే నివేదిక చెబుతోంది. 294 సీట్లు ఉన్న బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి తృణమూల్‌ గెలుపు అంత సులభమేమీ కాదని టైమ్స్ నౌ – సీ ఓటర్ సర్వే నివేదిక విశ్లేషించింది. అతి‌ కష్టం మీద మమత బెనర్జీ గట్టెక్కుతారని సర్వే ఫలితాలు అంచనా వేశాయి. అయితే, 2016 ఎన్నికలతో పోలిస్తే ఈసారి తృణమూల్ సీట్లలో భారీగా కోత పడుతుందని నివేదిక తెలిపింది.

2016 ఎన్నికల్లో 211 స్థానాల్లో గెలిచి రెండో సారి సీఎం అయిన మమతకు ఈసారి బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. అయినా కానీ స్వల్ప మెజార్టీతో మమత హ్యాట్రిక్‌ కొట్టే అవకాశం ఉందని టైమ్స్ నౌ – సీ ఓటర్ సర్వే నివేదిక పేర్కొంది. మరోవైపు బెంగాల్‌లో బీజేపీ బలమైన పార్టీగా ఎదిగి దీదీకి సవాల్‌గా మారింది. 2016 ఎన్నికల్లో కేవలం మూడు సీట్లను గెలుచుకున్న బీజేపీ ఈ నాలుగేళ్ళలో బలమైన పార్టీగా ఎదిగి పాలకపక్షాన్ని ఢీకొంటోంది. ఈ ఎన్నికల్లో 107 స్థానాల్లో బీజేపీ విజయం సాధించే అవకాశాలున్నాయని టైమ్స్ నౌ – సీ ఓటర్ సర్వే నివేదిక వెల్లడించింది. గత ఎన్నికల్లో 76 స్థానాల్లో గెలిచిన లెఫ్ట్ ఫ్రంట్ (కమ్యూనిస్టులు-కాంగ్రెస్‌ కూటమి) ఈసారి కేవలం 33 స్థానాలకే పరిమితమైపోతుందని తెలిపింది. ఇక్కడ ఇతరుల పెద్దగా ప్రభావం పెద్దగా ఉండదని పేర్కొంది.

ఇక 234 సీట్లున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతం ఎన్నికల్లో డీఎంకే హవా కనబడుతోందని టైమ్స్ నౌ – సీ ఓటర్ సర్వేలో తేలింది. ఈ ఎన్నికల్లో పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే- భాజపా కూటమి అధికారాన్ని కోల్పోతుందని అంఛనా వేస్తున్నారు. ఈ కూటమికి కేవలం 65 స్థానాలే వచ్చే అవకాశం ఉందని టైమ్స్ నౌ – సీ ఓటర్ సర్వే తెలిపింది. గత ఎన్నికల్లో జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే 136 స్థానాల్లో సత్తా చాటింది. 2021 ఎన్నికల్లో బీజేపీతో జతకట్టి బరిలో దిగిన అన్నాడీఎంకే కూటమికి ఎదురుగాలి వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో డీఎంకే- కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ కూటమికి 98 సీట్లు రాగా.. ఈసారి భారీగా పుంజుకొని 158 స్థానాల్లో విజయం లభించే అవకాశం ఉంటుందని పేర్కొంది.

కేరళలో సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌ కూటమి మరోసారి అధికారంలోకి వస్తుందని టైమ్స్ నౌ – సీ ఓటర్ సర్వే అంచనా వేసింది. మొత్తం 140 సీట్లున్న కేరళ అసెంబ్లీకి 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 91 స్థానాల్లో గెలుపొందిన ఎల్డీఎఫ్‌.. ఈసారి 82సీట్లు సాధించి రెండోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. 2016 ఎన్నికల్లో 47 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ ఈసారి కొద్దిమేరకు పుంజుకొని 56 సీట్లను సాధించే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. కేరళలో సీఎం అభ్యర్థిని సైతం ప్రకటించిన బీజేపీ పరిస్థితి ఏ మాత్రం మెరుగు పడదని టైమ్స్ నౌ – సీ ఓటర్ సర్వే అంఛనా వేస్తోంది. గతంలో గెలిచిన ఒక్క స్థానానికే బీజేపీ పరిమితమవుతుందని టైమ్స్ నౌ – సీ ఓటర్ సర్వే పేర్కొంది.

126 స్థానాలున్న అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే-యూపీఏ కూటమి మధ్య నువ్వా నేనా అన్నట్టుగా ఎన్నికలు జరుగుతున్నాయని టైమ్స్ నౌ – సీ ఓటర్ సర్వే చెబుతోంది. అయితే, ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 67 స్థానాలు గెలుచుకొని మరోసారి అధికారం నిలబెట్టుకుంటుందని పేర్కొంది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏకు 57 సీట్లు వస్తాయని అంచనా వేసింది. 2016 ఎన్నికల్లో 86 సీట్లు గెలుచుకున్న ఎన్డీయే బలం ఈసారి 67కి పడిపోతుందని అంఛనా వేశారు. 2016 ఎన్నికల్లో 26 సీట్లలో గెలిచిన యూపీఏ ఈసారి భారీగా పుంజుకొని 57 స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్టు తెలిపింది. 30 సీట్లున్న పుదుచ్చేరి అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో ఈసారి ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని టైమ్స్ నౌ – సీ ఓటర్ సర్వే చెబుతోంది. కాంగ్రెస్‌-డీఎంకే నేతృత్వంలోని యూపీఏ కూటమి 12 సీట్లు సాధించే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఎన్డీయే కూటమి 18, యూపీఏ 12 స్థానాలు గెలుస్తాయని టైమ్స్‌నౌ- సీఓటర్‌ సర్వే ఫలితాలు చెబుతున్నాయి.

ఈ లెక్కన జాతీయ స్థాయి కూటములు ఈ అయిదు అసెంబ్లీల ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపే పరిస్థితి కనిపించడం లేదు. ఒక్క బెంగాల్‌లో మాత్రమే ఎన్డీయే బలం బాగా పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. కేరళలో స్థానిక కూటమి, తమిళనాడులో విపక్ష డిఎంకే కూటమి విజయం సాధించవచ్చని ఒపీనియన్ పోల్ చాటుతోంది. అస్సాం, పుదుచ్ఛేరి లాంటి చిన్న అసెంబ్లీలలో బీజేపీ పాగా వేసే సంకేతాలు కనిపిస్తున్నాయి.

ALSO READ: ముంబైని దాటేసిన ఢిల్లీ.. డ్రగ్స్ వినియోగంలో దేశరాజధాని ప్రపంచంలోనే మూడో పెద్ద సిటీ

ALSO READ: దేశంలో శరవేగంగా ప్రైవేటైజేషన్.. పీఎస్యూలు, లిస్టెడ్ కంపెనీలు.. అన్నింట్లోంచి వాటా విక్రయం

ALSO READ: పెట్టుబడుల ఉపసంహరణ ఆగదంటున్న కేంద్రం.. ఇప్పటి వరకు డిజిన్వెస్టుమెంటు ప్రాసెస్ ఇదే!

ALSO READ: ఒక్క నినాదం.. బెంగాల్ ఎన్నికలను కుదిపేస్తోంది.. ఎవరి నోట విన్నా అదే మాట.. ఇంతకీ ఏంటది?

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!