ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో పెట్రో ఉత్పత్తులపై పన్నులు తగ్గింపు ? తాయిలాలు ఇవ్వాల్సిందే !
ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో పెట్రోలియం ఉత్పత్తులపై పన్నులు తగ్గించే విషయాన్ని కేంద్రం చురుకుగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.పెట్రోలు, డీజిల్ పై పన్నులు తగ్గించే అంశంపై కేంద్రం రాష్ట్రాలతో చర్చిస్తున్నట్టు సమాచారం.
ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో పెట్రోలియం ఉత్పత్తులపై పన్నులు తగ్గించే విషయాన్ని కేంద్రం చురుకుగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.పెట్రోలు, డీజిల్ పై పన్నులు తగ్గించే అంశంపై కేంద్రం రాష్ట్రాలతో చర్చిస్తున్నట్టు సమాచారం. తమ ఎన్నికల ప్రచారాల్లో ప్రతిపక్షాలు ప్రధానంగా ఈ విషయాన్ని ప్రస్తావించి ప్రభుత్వాన్ని ఇరకాటాన బెట్టే సూచనలు ఉన్నాయి. ఇప్పటికే పార్లమెంటులో విపక్షాలు దీనిపై మోదీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ముఖ్యంగా రాజ్యసభలో విపక్ష సభ్యుల నిరసనల కారణంగా చైర్మన్ వెంకయ్యనాయుడు పలు మార్లు సభను వాయిదా వేయాల్సి వస్తోంది. గత కొన్ని నెలలుగా దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రాజస్తాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ 100 రూపాయల పై మాటే అయింది. అలాగే డీజిల్ లీటర్ 80 రూపాయలయింది. వీటి ధరల పెరుగుదల కారణంగా నిత్యావసరాల ధరలు కూడా పెరుగుతున్నాయి. అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రాలకు కూడా పెట్రో ఉత్పత్తులపై పన్నులు అత్యంత ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న నేపథ్యంలో సహజంగానే ఇది ప్రాధాన్య విషయంగా మారింది. కోవిడ్ పాండమిక్ కారణంగా నిధుల కటకట ఏర్పడడంతో కేంద్రం వీటి ధరల పెంపుపై దృష్టి పెట్టక తప్పలేదు. గత ఏడాది
ఇంధనంపై పన్నుల విధింపు ద్వారా కేంద్రానికి, రాష్ట్రాలకు ఏటా 5.5 లక్షల కోట్ల ఆదాయం వస్తున్నట్టు అంచనా.జీఎస్టీ పరిశీ కిందకు వీటిని తెచ్చిన పక్షంలో కేంద్రానికి, రాష్ట్రాలకు ఏటా 2.5 లక్షల కోట్ల ఆదాయం నష్టం వస్తుందని చెబుతున్నారు. ఇక 4 రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. దీన్ని పురస్కరించుకుని. విపక్షాల ప్రచారాలను ఎదుర్కొనేందుకు కేంద్రం ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం పెట్రో ఉత్పత్తులపై పన్నులు తగ్గించే విషయాన్ని చురుకుగా పరిశిలిస్తోందని, దీనిపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలకు సమాయత్తమవుతోందని తెలుస్తోంది. పన్నులు తగ్గిస్తే వీటి ధరలు తగ్గుతాయి గనుక అది తమ విజయావకాశాలకు తోడ్పడుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.
మరిన్ని ఇక్కడ చదవండి:
Municipal Elections 2021: మచిలీపట్నంలో కొనసాగుతున్న పోలింగ్.. వృద్ద ఓటర్లకు పోలీసుల సహాయం
‘శాటిలైట్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ ఉడిపి రామచంద్రరావుకు అరుదైన గౌరవం ఇచ్చిన గూగుల్..