Udupi Ramachandra Rao: ‘శాటిలైట్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ ఉడిపి రామచంద్రరావుకు అరుదైన గౌరవం ఇచ్చిన గూగుల్..

Google Doodle: గూగుల్ ప్రత్యేక తేదీలతోపాటు.. ప్రముఖుల జయంతి సందర్బాలకు ప్రత్యేకంగా విష్ చేస్తుంటుంది. అందుకోసం గూగుల్ సెర్చ్ ఇంజిన్ బార్‏లో ఐకాన్‏తో

Udupi Ramachandra Rao: 'శాటిలైట్ మ్యాన్ ఆఫ్ ఇండియా' ఉడిపి రామచంద్రరావుకు అరుదైన గౌరవం ఇచ్చిన గూగుల్..
Follow us

| Edited By: Team Veegam

Updated on: Mar 10, 2021 | 11:48 AM

Google Doodle: గూగుల్ ప్రత్యేక తేదీలతోపాటు.. ప్రముఖుల జయంతి సందర్బాలకు ప్రత్యేకంగా విష్ చేస్తుంటుంది. అందుకోసం గూగుల్ సెర్చ్ ఇంజిన్ బార్‏లో ఐకాన్‏తో వారికి విషెష్ తెలపడం చేస్తుంటుంది. తాజాగా బుధవారం గూగుల్ సెర్చ్ ఇంజిన్‏లో ఒక వ్యక్తి టెక్నాలజీని తన చేతిలో పైకి పట్టుకొని కనిపిస్తుండగా.. వెనకలా భూగోళంపై భారతదేశం కనిపిస్తుంది. అయితే అందులో కనిపిస్తున్న వ్యక్తి ఎవరు ? ఇవాళ ఏంటీ ప్రత్యేకత అని చాలా మందిలో సందేహాలు మొదలై ఉంటాయి. మరీ గూగుల్ ఎందుకు ఆ వ్యక్తి డూడుల్ క్రియేట్ చేసిందో తెలుసుకుందామా.

గూగుల్ టుడే డూడుల్ ‘శాటిలైట్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ గా పిలువబడే ప్రసిద్ధ భారత ప్రొఫెసర్, శాస్త్రవేత్త ఉడిపి రామచంద్రరావు 89వ పుట్టినరోజును జరుపుకుంటుంది. ప్రొఫెసర్ రావు 2017లో మరణించారు. అతను అంతరిక్ష శాస్త్రవేత్త అలాగే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అధ్యక్షుడు. 1932లో కర్ణాటకలోని మారుమూల గ్రామంలో జన్మించిన ప్రొఫెసర్ రావు కాస్మిక్ రే భౌతిక శాస్త్రవేత్తగా చేసాడు. అలాగే భారత అంతరిక్ష కార్యక్రమానికి పితామహుడిగా పరిగణించబడే డాక్టర్ విక్రమ్ సారాభాయ్లతో కలిసి తన వృత్తిని ప్రారంభించాడు. డాక్టరేట్ పూర్తి చేసిన తరువాత ప్రొఫెసర్ రావు యుఎస్ వెళ్లి అక్కడ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆ తర్వాత నాసా యొక్క ‘పయనీర్, ఎక్స్‌ప్లోరర్ స్పేస్ ప్రోబ్’ పై ప్రయోగాలు చేశారు. గూగుల్ డూడుల్ ఈ రోజు భూమి, నక్షత్రాల నేపథ్యంతో ప్రొఫెసర్ రావు యొక్క స్కెచ్‌ను చూపించింది.

ప్రొఫెసర్ రావు 1966లో భారతదేశానికి తిరిగి వచ్చి 1972లో తన దేశం యొక్క ఉపగ్రహ కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి ప్రయత్నించారు. ఖగోళ శాస్త్రానికి భారతదేశపు ప్రధాన సంస్థ అయిన ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీలో హై ఎనర్జీ ఖగోళ శాస్త్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు.1975లో భారతదేశం యొక్క మొట్టమొదటి ఉపగ్రహం ‘ఆర్యభట్ట’ ప్రయోగంలో కీలక పాత్ర పోషించారు. ఈ ఉపగ్రహం నుంచి కమ్యూనికేషన్, వాతావరణ సమాచారం అందుకోవడం ప్రారంభించింది. ఇది దేశానికి ముఖ్యంగా గ్రామీణ భారతదేశానికి ఎంతగానో సహాయపడింది. గూగుల్ ప్రకారం 1984 నుంచి 1994 వరకు ప్రొఫెసర్ రావు తన దేశం యొక్క అంతరిక్ష కార్యక్రమాన్ని ఎత్తులకు పెంచడానికి ఇస్రో ఛైర్మన్‌గా పనిచేశారు. ఇవే కాకుండా ప్రోఫెసర్ 250కి పైగా ఉపగ్రహాలను ప్రయోగించిన పిఎస్‌ఎల్‌వి లాంటి రాకెట్ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ప్రొఫెసర్ రావు 2013లో ‘శాటిలైట్ హాల్ ఆఫ్ ఫేమ్’లో ప్రవేశించిన మొదటి భారతీయుడిగా నిలిచాడు. అదే సంవత్సరంలో పిఎస్ఎల్వి భారతదేశం యొక్క మొట్టమొదటి’ ఇంటర్ల్పానెటరీ మిషన్ ‘మంగల్యాన్ ను ప్రారంభించారు. ఇది ఇప్పటికీ అంగారక గ్రహం చుట్టూ తిరుగుతుంది.

Also Read: కొంప ముంచిన ఓవరాక్షన్… బైక్ పై స్టంట్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఇద్దరు యువకులు..

కేజీఎఫ్ స్టార్ యష్ తల్లిదండ్రులకు, గ్రామస్తులకు మధ్య తీవ్ర వివాదం.. అసలు కారణం ఇదే.!

నా శరీరంలో అవి నాకు కూడా నచ్చవు’.. ట్రోల్స్ చేసేవారికి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన ఇలియానా..