AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొంప ముంచిన ఓవరాక్షన్… బైక్ పై స్టంట్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఇద్దరు యువకులు..

ప్రస్తుతం చాలా మంది యువత.. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ సంపాధించుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం రకాల రకాల ప్రమాదకరమైన

కొంప ముంచిన ఓవరాక్షన్... బైక్ పై స్టంట్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఇద్దరు యువకులు..
Rajitha Chanti
|

Updated on: Mar 10, 2021 | 9:18 AM

Share

ప్రస్తుతం చాలా మంది యువత.. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ సంపాధించుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం రకాల రకాల ప్రమాదకరమైన ప్రయోగాలు చేస్తూ.. ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. అలాంటి వీడియోలు ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రమాదకరమైన ప్రయోగాలు చేయకూడదని పోలీసులు హెచ్చరిస్తున్న యువతలో మార్పు మాత్రం కనిపించడం లేదు. తాజాగా ఇద్దరు యువకులు తమ బైక్ పై చేసిన స్టంట్ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది.

ఈ వీడియోలో ఇద్దరు యువకులు బైక్ తమ బైక్ పై అత్యంత ప్రమాదకరంగా స్టంట్ చేయడం కనిపిస్తుంది. వెనక కూర్చున్న యువకుడు బైక్ స్పీడ్‏గా డ్రైవ్ చేస్తుంటే.. అతని ముందు ఉన్న మరో యువకుడు బైక్ పై ఎలాంటి సహయం లేకుండా నిల్చోని ఉన్నాడు. అలా కొద్ది దూరం వచ్చాక.. ముందు నిల్చున్న అబ్బాయి రన్నింగ్‎లో ఉన్న బైక్ పై నుంచి దిగడానికి ప్రయత్నిస్తూ.. పట్టు తప్పి కిందపడిపోయాడు. అతనితోపాటు బైక్ డ్రైవ్ చేస్తున్న అబ్బాయి కూడా బండితో సహ రోడ్డు పై పడిపోయాడు. ఈ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాన్షు కబర్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసారు. అందులో “జీవితం ఒకేసారి వస్తుంది.. మళ్లీ రాదు.. మీ మూర్ఖత్వంతో దానిని వృథా చేయకండి”.. అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియోను నెట్టింట్లో పోస్ట్ చేయగానే లక్ష వ్యూస్ వచ్చాయి. అయితే ఈ ఎప్పుడు ఎక్కడ జరిగిందనే విషయం మాత్రం తెలియరాలేదు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియోను మీరు ఒకసారి చూసేయ్యండి.

Also Read:

నన్ను చంపేయండి బాబు… పోలీసులను వేడుకుంటున్న మహిళ.. నెట్టింట్లో వైరల్‏గా మారిన వీడియో..

అరుదైన కిరీటాన్ని ధరించిన పెళ్ళికూతురు.. నెట్టింట్లో వైరల్‏గా మారిన యువజంట వివాహాం..

శృతిమించిన అభిమానం.. వేదికపై బన్నీని చుట్టుముట్టిన ఫ్యాన్స్.. అసహనానికి గురైన స్టైలీష్ స్టార్..