నన్ను చంపేయండి బాబు… పోలీసులను వేడుకుంటున్న మహిళ.. నెట్టింట్లో వైరల్‏గా మారిన వీడియో..

ఉత్తర మయన్మార్ పట్టణంలోని పోలీసుల ముందు మోకాళ్ళపై కుర్చొని ఓ మహిళా సన్యాసి వారిని అభ్యర్థించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నన్ను చంపేయండి బాబు... పోలీసులను వేడుకుంటున్న మహిళ.. నెట్టింట్లో వైరల్‏గా మారిన వీడియో..
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 10, 2021 | 8:39 AM

ఉత్తర మయన్మార్ పట్టణంలోని పోలీసుల ముందు మోకాళ్ళపై కుర్చొని ఓ మహిళా సన్యాసి వారిని అభ్యర్థించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత నెల తిరుగుబాటుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న నిరసనకారులను కాల్చడం మానేయమని వారిని ఆ మహిళ వేడుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో ఇప్పుడు హాట్ టాపిక్‏గా మారింది.

మైట్కినా పట్టణంలోని ఒక వీధిలో సోమవారం ఈ మహిళ మోకరిల్లినట్లుగా కనిపిస్తోంది. ఇద్దరు పోలీసుల ముందు మోకాళ్లపై కూర్చొని ఆమె వేడుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. “నిరసనకారులను చంపొద్దు.. నన్ను చంపండి” అంటూ ఆమె వేడుకుంది. “నేను ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టడం చూడకూడదు అనుకుంటున్నాను. మీరు వాళ్ళను విడిచిపెట్టకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళను” ఆమె వేడుకుంది. అలాగే పిల్లలను కాల్చవద్ధని మిమ్మల్ని కోరుకుంటున్నాను అని అభ్యర్థించింది. సోమవారం పోలీసులు ఇద్దరు నిరసనకారుల తలపై కాల్చి చంపారు. అందులో మరో ముగ్గురు గాయపడ్డారు. కాగా తాంగ్ గత నెల చివర్లో నిరసనకారులు, పోలీసుల మధ్య శాంతి కోసం ప్రయత్నిస్తున్నట్లుగా అక్కడి మీడియా తెలిపింది. మయన్మార్‌లో సైనిక ప్రభుత్వం గద్దె దిగలంటూ నిరసనలు సాగుతోండగా.. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు సైన్యం, పోలీసులు విచక్షణా రహితంగా ప్రవర్తిస్తున్నారు. రబ్బరు తూటాలతో భాష్పవాయువును ప్రయోగిస్తూ.. నిరసనకారులపై విరుచుకుపడుతున్నారు. ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి జరుగుతోన్న హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు 60మంది చనిపోగా.. 18వందల మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యాంగాన్ సిటీలో జరిగిన ఘటనల్లో సన్యాసిని తనముందే నిరసనకారుడిని పోలీసులు తలపై కాల్చి చంపడం చూసి చలించిపోయింది. రక్తమోడుతూ వ్యక్తి చనిపోగా తట్టుకోలేకపోయింది ఆమె. సిస్టర్ యాన్ రోజ్ అనే నన్‌తో పాటు మరో ఇద్దరు నన్స్ కూడా ఇలాగే వేడుకున్నారు.

Also Read:

అరుదైన కిరీటాన్ని ధరించిన పెళ్ళికూతురు.. నెట్టింట్లో వైరల్‏గా మారిన యువజంట వివాహాం..