అరుదైన కిరీటాన్ని ధరించిన పెళ్ళికూతురు.. నెట్టింట్లో వైరల్‏గా మారిన యువజంట వివాహాం..

మారుతున్న కాలానికి అనుగుణంగా వివాహా వేడుకలు కూడా మారిపోయాయి. ఇటీవల పెళ్లికి ముందుగానే వరుడు, వధువు ప్రీవెడ్డింగ్ ఫోటో షూట్స్ అంటూ వివిధ రకాలుగా

అరుదైన కిరీటాన్ని ధరించిన పెళ్ళికూతురు.. నెట్టింట్లో వైరల్‏గా మారిన యువజంట వివాహాం..
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 10, 2021 | 8:01 AM

మారుతున్న కాలానికి అనుగుణంగా వివాహా వేడుకలు కూడా మారిపోయాయి. ఇటీవల పెళ్లికి ముందుగానే వరుడు, వధువు ప్రీవెడ్డింగ్ ఫోటో షూట్స్ అంటూ వివిధ రకాలుగా ఫోటోలకు ఫోజులిస్తున్నారు. ఇక కరోనా ప్రభావంతో పెళ్లికి అతి తక్కువమంది మాత్రమే నిబంధనలున్న కారణంగా ఫోటో షూట్స్ తీసుకునేవారు ఎక్కువైపోయారు. ఇక ఆ ఫోటో షూట్స్ మరింత విభిన్నంగా ఉండేందుకు చాలా వెరైటీగా ఫోటోలు దిగుతుంటారు. అందులో కొన్ని విమర్శలకు గురవ్వగా.. మరికొంతమందివి ఆసక్తికరంగా నిలిచాయి. తాజాగా ఓ యువజంట తమ పెళ్లిలో తీసుకున్న ఫోటో షూట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఇక్కడ వివాహంలో వధువు తాను మరింత అందంగా కనిపించడమే కాకుండా.. పెళ్లికి వచ్చిన అతిధుల దృష్టి కేవలం తనపై నిలిచేలా చేసుకుంది. అందుకోసం తనను తాను విభిన్నంగా మార్చుకుంది. తీగలతో అల్లుకున్నటువంటి ఎంబ్రాయిడరీ చేసిన డ్రెస్ ధరించి.. చెవులకు పెద్ద పెద్ద జూకాలు పెట్టుకొని, పాపిట్లో వెడల్పాటి మాంగ్ టిక్కా అభరణాలను అలంకరణ చేసుకొని ఫుల్ గ్రాండ్‏గా రెడి అయిపోయింది. వీటన్నింటికంటే ఎక్కువగా వధువు ధరించిన కిరీటం మరింత ఆకర్షణీయంగా నిలిచింది. ఈ ఫోటోలను తీసిన నటాషా జుబైర్ తన షోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు.

ఈ ఫోటోలో కనిపిస్తున్న పెళ్ళికూతురు పాకిస్తాన్‏కు చెందిన వాజ్మా. తన పెళ్ళి కోసం తనను తాను విభిన్నంగా మార్చుకుంది. “నేను చాలా మంది పెళ్ళి కూతుళ్ల ఫోటోలను తీశాను. చాలా రకాల డిజైనర్ డ్రెస్సులు చూశాను. వాటిలో ఎలాంటి ఢిపరెంట్ కనిపించలేదు. కానీ వాజ్మా ఫోటోలను నాకు ప్రత్యేకంగా అనిపించాయి. ఆమె ధరించిన దుస్తులు నాకు ప్రత్యేకంగా అనిపించాయి. అలాగే ఆమె కిరీటం మరింత ఆకర్షణీయంగా అనిపించింది. తెలుగు, ఎరుపు గులాబీలతో కురలను అందంగా తీర్చిదిద్దింది. ఆమె డ్రెస్సింగ్ మొత్తం చైనీస్, ఇండోనేషియా సంస్కృతి నుంచి తీసుకున్నవి. అలాగే తల అభరణాలను మాత్రం కస్టమైజ్ చేసింది అంటూ తెలిపాడు”. ప్రస్తుతం ఈ యువజంట ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Also Read:

టమాటా పులిహోరా.. ఇలా చేస్తే క్షణాల్లోనే మరింత రుచికరంగా.. మీరు ట్రై చేసేయ్యండిలా..