శృతిమించిన అభిమానం.. వేదికపై బన్నీని చుట్టుముట్టిన ఫ్యాన్స్.. అసహనానికి గురైన స్టైలీష్ స్టార్..

సినీ ఇండస్ట్రీకి చెందినవారు బయట కనిపిస్తే చాలు అభిమానులు చేసే అతివినయం మాములుగా ఉండదు. ఇక అభిమాన హీరో దగ్గరగా వస్తే.. వారు చేసే పని

శృతిమించిన అభిమానం.. వేదికపై బన్నీని చుట్టుముట్టిన ఫ్యాన్స్.. అసహనానికి గురైన స్టైలీష్ స్టార్..
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 10, 2021 | 6:40 AM

సినీ ఇండస్ట్రీకి చెందినవారు బయట కనిపిస్తే చాలు అభిమానులు చేసే అతివినయం మాములుగా ఉండదు. ఇక అభిమాన హీరో దగ్గరగా వస్తే.. వారు చేసే పని గురించి చెప్పాల్సిన పనిలేదు. తాజాగా టాలీవుడ్ స్టైలీష్ స్టార్‎కు తన ఫ్యాన్స్ నుంచి చెదు అనుభవం ఎదురైంది. ఆర్ఎక్స్ 100 హీరో కార్తీకేయ, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘చావు కబురు చల్లగా’. మంగళవారం సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‏కు బన్నీ ముఖ్య అతిదిగా హజరయ్యారు. వేదికపై బన్నీని చూడగానే.. ఫ్యాన్స్ ఒక్కసారి చుట్టుముట్టేసి కాళ్లపై పడిపోయారు. సెక్యూరిటీ సిబ్బందిని తప్పించుకొని ఒకరి తర్వాత ఒకరు వేదికపై దూసుకొచ్చారు. బన్నీ కాళ్లపై పడిపోవడంతో.. ఒక దశలో అల్లు అర్జున్ కూడా పడిపోయే స్థితికి చేరుకున్నాడు. ఇక వాళ్ళ నుంచి బన్నీని సురక్షితంగా కాపాడాటానికి సెక్యూరిటీ సిబ్బంది నానా తంటాలు పడ్డారు.

వివరాళ్ళోకెలితే.. చావు కబురు చల్లగా ప్రీరిలీజ్ ఈవెంట్‏కు ముఖ్య అతిదిగా హజరైన బన్నీ మాట్లాడటం స్టార్ట్ చేసిన కాసేపటికి ఒక అభిమాని వేదికపైకి వచ్చేశాడు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అతడిని లాగేస్తుండగా.. బన్నీ అడ్డుపడి.. ఆగండి అంటూ అతడిని హత్తుకున్నారు. అన్నా ఒక్క ఫోటో అని అభిమాని అడగగానే సెల్ఫీ తీసుకున్నారు. ఆ ఫొటోను తన అభిమానికి ఇమ్మని ఫొటోగ్రాఫర్లను కోరారు. ‘‘ఎవరు పంపిస్తున్నారయ్యా ఇలాంటి వాళ్లను. ప్రతి ఈవెంట్‌లోనూ కావాలని పంపిస్తున్నారా’’ అని నవ్వుతూనే అన్నారు బన్నీ. ఇక ఫోటో దిగాక మళ్లీ తాను మాట్లాడటం మొదలుపెట్టాడు బన్నీ. మళ్లీ కాసేపటికి మరో అభిమాని వేదికపైకి వచ్చి బన్నీ కాళ్లు పట్టుకున్నాడు. ఆ సమయంలో బన్నీ దాదాపు పడిపోయే స్థితికి చేరుకున్నాడు. దీంతో వెంటనే తమ్ముడు ఆగు ఆగు అంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుండగా.. మరో అభిమాని వెనకవైపు నుంచి వచ్చి గట్టిగా పట్టుకున్నాడు. దీంతో సెక్యూరిటీ వాళ్ళను దూరం చేయడానికి చాలా కష్టపడ్డారు. ఈ క్రమంలోనే అక్కడ కాస్త తోపులాట జరిగింది. సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళను కొట్టాడానికి ప్రయత్నించినప్పుడు బన్నీ అడ్డుపడ్డారు. ఈ సంఘటనల తర్వాత అక్కడ అంత గోల గోల జరిగింది. అందులోనే బన్నీ ఇబ్బందిగా మాట్లాడారు. ‘చావు కబురు చల్లగా’ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తుండగా.. నూతన డైరెక్టర్ కౌశిక్ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు విడుదలైన సాంగ్స్, పోస్టర్స్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ మార్చి 19న థియేటర్లలోకి రానుంది.

Also Read:

Pawan Kalyan : క్యాన్సర్‌‌‌‌తో పోరాడుతున్న అభిమానిని పరామర్శించిన పవర్‌‌‌‌‌‌‌స్టార్ పవన్ కళ్యాణ్..