నేను హిందూ మహిళను, బీజేపీ మత రాజకీయాలు చేస్తోంది, మమతా బెనర్జీ.
మతం పేరిట బీజేపీ ప్రజలను చీల్చాలని చూస్తోందని బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. బీజేపీ కుయుక్తులను ప్రజలు గ్రహించాలని ఆమె కోరారు.
మతం పేరిట బీజేపీ ప్రజలను చీల్చాలని చూస్తోందని బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. బీజేపీ కుయుక్తులను ప్రజలు గ్రహించాలని ఆమె కోరారు. మంగళవారం నందిగ్రామ్ లో జరిగిన తమ పార్టీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆమె.. ప్రజల అభిమతం మేరకే తనీ నియోజకవర్గాన్ని ఎంచుకున్నానని తెలిపారు. ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేయాలని తాను అనుకోవడానికి కారణం ఈ నియోజకవర్గం మీద తనకున్న అభిమానమేనన్నారు. త్వరలో ఇక్కడ రెండు భారీ ర్యాలీలను నిర్వహిస్తామని, ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సువెందు అధికారిని ఓడిస్తానని ఆమె చెప్పారు. ఈ సందర్భంగా ఆమె.. తాను హిందూ మహిళనని, అయితే బీజేపీ..హిందూ, ముస్లిం పాలిటిక్స్ తో ఆటలాడుకుంటోందని దుయ్యబట్టారు. నేను హిందూ అని తెలుసుకోండి అని బీజేపీని ఉద్దేశించి తీవ్రంగా వ్యాఖ్యానించారు. బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించాక మమత నందిగ్రామ్ నియోజకవర్గాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి.
మొదట సింగూర్ నుంచి పోటీ చేయాలని భావించినా.. ఆ తరువాత ఈ స్థానాన్ని ఎంచుకున్నానని ఆమె చెప్పారు.మమత బుధవారం ఈ స్థానానికి తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. అటు- ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న సువెందు అధికారి తను మమతా బెనర్జీపై 50 వేల ఓట్ల తేడాతో విజయం సాధిస్తానని మొదటే ప్రకటించారు. లేని పక్షంలో రాజకీయాల నుంచి వైదొలగుతానని అన్నారు. ఇలా ఉండగా బెంగాల్ ఎన్నికల ముందు పలువురు నేతలు, ప్రజా ప్రతినిధులు తృణమూల్ కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరుతున్నారు. నిన్న మాజీ డిప్యూటీ స్పీకర్ సహా అయిదుగురు ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అంతకు ముందు కొందరు సినీ, టీవీ ఆర్టిస్టులు కూడా బీజేపీలో చేరారు. ఇక ఈ నెల 7 న కోల్ కతా లోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన సభలో ప్రధాని మోదీ రావడానికి కొద్దిసేపటి ముందు బెంగాలీ, బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి బీజేపీ కండువా కప్పుకున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ :
India Vs England: కెప్టెన్ విరాట్ కోహ్లీ కి ఇది నిజంగా అవమానమే…!
Jharkhand: అసెంబ్లీకి గుర్రంపై వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే.. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో..!