Election 2023: మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో కొనసాగుతున్న పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకున్న ముఖ్య నేతలు
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఛత్తీస్‌గఢ్‌లో రెండో దశలో భాగంగా 70 స్థానాలకు, మధ్యప్రదేశ్‌లో ఒకే దఫాలో 230 స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు జరుగుతున్న 70 స్థానాల్లో 958 మంది అభ్యర్థులు బరిలో నిలవడంతో ఫలితాలు ఏవిధంగా ఉంటాయో అన్న ఉత్కంఠను పెంచుతోంది.

అయితే రెండు రాష్ట్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది. వృద్ధులు, మహిళలు ఓటు వేసేందుకు భారీగా తరలివస్తున్నారు. నడవలేని స్థితిలో ఉన్న ఓటర్ల కోసం ప్రత్యేకంగా వీల్‌చైర్లు ఏర్పాటు చేశారు. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోవడంపై యువత హర్షం వ్యక్తం చేస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు బహిష్కరించాలన్న మావోయిస్టుల పిలుపుతో పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా సాగుతోంది. సెహోర్ నియోజకవర్గ కేంద్రంలోని 26 పోలింగ్ బూత్‌లో సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ సతీసమేతంగా ఓటుహక్కు వినియోగించుకున్నారు. అనంతరం పోలింగ్ సరళిని నేతలను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రం దగ్గర నిల్చున్న ఓటర్లకు అభివాదం చేశారు. లడ్లీ బెహనా యోజన పథకంతో మహిళలు, యువతను ఆకర్షించగలిగామన్నారు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.
మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో ఓటుహక్కు వినియోగించుకున్నారు ఆరాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కమల్‌నాథ్. కాంగ్రెస్ అభ్యర్థి సతీశ్ శికర్‌వార్ పోటీ చేస్తున్న అసెంబ్లీ స్థానంలో ఆయన ఓటు వేశారు. ఓటేయడానికి ముందు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తన ఇంటికి భారీగా చేరుకున్న నేతలతో రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌సరళిపై చర్చించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కమల్ నాథ్.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..