Bank Strike: డిశంబర్, జనవరిలో విడతల వారిగా బ్యాంకులు బంద్.. కారణం ఇదే..
భారతదేశ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు మూతపడనున్నాయి. తమ సమస్యలతో పాటూ సదుపాయాల నిమిత్తం స్ట్రైక్‌లోకి వెళ్లనున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాతో పాటు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీ అసోసియేషన్ బుధవారం ఒక ప్రకటన వెలువరించింది. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు డిసెంబర్ 4 నుండి జనవరి 20 వరకు తేదీల వారీగా సమ్మె చేయనున్నట్లు ప్రకటించింది.

భారతదేశ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు మూతపడనున్నాయి. తమ సమస్యలతో పాటూ సదుపాయాల నిమిత్తం స్ట్రైక్‌లోకి వెళ్లనున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాతో పాటు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీ అసోసియేషన్ బుధవారం ఒక ప్రకటన వెలువరించింది. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు డిసెంబర్ 4 నుండి జనవరి 20 వరకు తేదీల వారీగా సమ్మె చేయనున్నట్లు ప్రకటించింది. ID చట్టం 1947లోని సెక్షన్ 22లోని సబ్-సెక్షన్ (1)లో ఉన్న నిబంధనలకు అనుగుణంగా, మా అసోసియేషన్‌లోని సభ్యులందరూ, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్‌గా కొనసాగించాలని ప్రతిపాదిస్తున్నామని తెలియజేస్తున్నట్లు నోట్ రిలీజ్ చేశారు. ఏఏ సమస్యలపై సమ్మె చేస్తున్నారో వివరించారు. అన్ని బ్యాంకుల్లో అవసరమైన సిబ్బందిని త్వరగా నియమించాలి, ప్రస్తుతం బ్యాంకుల్లో పనిచేసే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, వేతనాల విషయంలో కూడా సెటిల్మెంట్ నిబంధనను కొత్తగా తీసుకురావాలని అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇందులో ప్రభుత్వ బ్యాంకులే కాదు, ప్రైవేట్ బ్యాంకులు కూడా డిసెంబర్ 11న అఖిల భారత సమ్మెకు దిగనున్నాయి. జనవరి 19, 20 తేదీలలో ప్రభుత్వ, ప్రైవేట్‌తో సహా అన్ని బ్యాంకులు సమ్మెకు దిగినప్పుడు సమ్మె ప్రభావం తీవ్రంగా ఉంటుంది. డిసెంబర్ 4 నుంచి సమ్మె ప్రారంభం కానున్నట్లు తెలిపారు. డిసెంబరు 4న ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌ల వద్ద అఖిల భారత సమ్మె ప్రారంభమవుతుంది. డిసెంబర్ 5, 6, 7, 8, 11 తేదీల్లో వివిధ బ్యాంకులు మూసివేయబడతాయని పేర్కొంది. రాష్ట్రాల వారీగా బ్యాంకుల సమ్మె వివరాలు వెల్లడించింది. అయితే, జనవరి 2 నుండి, సమ్మె రాష్ట్రాల వారీగా పనిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
జనవరి 2న తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్ష్వదీప్‌లోని అన్ని బ్యాంకుల ఉద్యోగులు సమ్మె చేయనున్నారు. జనవరి 3, 4, 5, 6 తేదీల్లో రాష్ట్రాల వారీగా సమ్మెలు నిర్వహించనున్నారు. ఉత్తరప్రదేశ్, న్యూఢిల్లీలోని బ్యాంకులు జనవరి 4 మరియు 5 తేదీలలో మూసివేయబడతాయని తెలిపింది. రెండు రోజుల అఖిల భారత బ్యాంకుల సమ్మెలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ సహా అన్ని బ్యాంకులు జనవరి 19, 20 తేదీల్లో రెండు రోజుల సమ్మెకు దిగనున్నాయి.

Banks Strike In India
మరిన్ని బిజినెస్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..