Election Expenses: లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులు చేసే ఖర్చు ఎంతంటే..

దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ, లోక్ సభ రెండింటికీ ఎన్నికలు నిర్వహిస్తోంది ఎన్నికల కమిషన్. భారతదేశ వ్యాప్తంగా కొన్ని వేల మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకోనున్నారు. ఎవరైతే ప్రజల నాడిని బాగా పట్టుకోగలరో వారే చట్టసభలకు ఎన్నికవుతారు.

Election Expenses: లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులు చేసే ఖర్చు ఎంతంటే..
Election expenses
Follow us

|

Updated on: Mar 29, 2024 | 7:18 PM

దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ, లోక్ సభ రెండింటికీ ఎన్నికలు నిర్వహిస్తోంది ఎన్నికల కమిషన్. భారతదేశ వ్యాప్తంగా కొన్ని వేల మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకోనున్నారు. ఎవరైతే ప్రజల నాడిని బాగా పట్టుకోగలరో వారే చట్టసభలకు ఎన్నికవుతారు. ఇలా ఎన్నికవ్వాలంటే ముందు పోటీలోకి దిగాలి. పోటీలో దిగడం అంత సులవైన పనేమీ కాదు. ఏదో ఒక పార్టీలో చేరాలి. పార్టీ కోసం కష్టపడినప్పటికీ ఒక్కోసారి టికెట్ రాకపోవచ్చు. ఇలా పార్టీతో సంబంధం లేకుంటే స్వతంత్ర అభ్యర్థిగా కూడా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. భారత రాజ్యాంగం చెప్పిన దాని ప్రకారం భారత పౌరుడై ఉండాలి. కనీసం 18 సంవత్సరాలు వయసు కలిగి ఉండాలి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎలాంటి విధులు నిర్వహించకూడదు. ఒకవేళ ఉద్యోగిగా ఉంటే రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావచ్చు. ఇక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి గెలుపు ఖర్చుపై ఆధారపడి ఉంటుంది. కానీ భారత ఎన్నికల సంఘం ఖర్చుపై పరిమితి కూడా విధించింది. లోక్ సభ అభ్యర్థి తన నియోజకవర్గ పరిధిలో ఎంత ఖర్చు చేయాలి. అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పోటీ చేసే అభ్యర్థి ఎంత ఖర్చు చేయాలి అనే అంశాన్ని స్పష్టం చేసింది. ఈ ఖర్చు కూడా ఫ్లెక్సీలు, బ్యానర్లు, పాంప్లెట్లు, కార్యకర్తల భోజనం ఖర్చులు, ప్రచార రథాలు, వాటి నిర్వహణ, మైక్ సెట్, పార్టీ జెండాలు, కండువాలు ఇలాంటి వాటికి సంబంధించినవి మాత్రమే పరిగణలోకి తీసుకుంటుంది. మిగిలిన వాటిని తన పరిధిలోకి తీసుకోదు. ఈ నిబంధనలను అతిక్రమింస్తే తగు చర్యలు తీసుకుంటుంది ఎన్నికల కమిషన్.

లోక్‌సభకు రూ. 95 లక్షల పరిమితి..

ఒక లోక్‌సభ స్థానంనుంచి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి కనిష్టంగా రూ. 75 లక్షలు ఖర్చు చేస్తే గరిష్టంగా రూ. 95 లక్షల వరకు ఖర్చు చేయవచ్చని వెల్లడించింది. ఈ ఆదేశాలు అతిక్రమిస్తే ఎన్నికల నుంచి డిస్ క్వాలిఫై చేస్తుంది ఎన్నికల సంఘం. అలాగే గరిష్టంగా ఉన్న ఖర్చు రూ. 95 లక్షలను అన్ని నియోజకవర్గాల్లో కాకుండా ఎక్కువ మంది ఓటర్లు ఉన్న పెద్ద నియోజకవర్గాలకు మాత్రమే కేటాయించింది. పార్లమెంట్ అంటే దాదాపు 15 లక్షల పై చిలుకు ఓటర్లు ఉంటారు. అదే అత్యధిక ఓటర్లు కలిగిన నియోజకవర్గం అయితే 25లక్షల మంది ఓటర్లు ఉంటారు. అలాంటి చోట బరిలో నిలిచిన అభ్యర్థి రూ. 95 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు. ఈ పరిమితికి మించకూడదు. అదే 15 లక్షల లోపు ఓటర్లు ఉన్న వాటిని చిన్న నియోజకవర్గాలుగా పరిగణస్తారు. ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులు రూ. 75 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు. అంతకు మించితే కచ్చితంగా ఎన్నికల కమిషన్ చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది.

ఇవి కూడా చదవండి

అసెంబ్లీకు రూ. 40 లక్షలు పరిమితి..

ఇక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి కనిష్టంగా రూ. 20 లక్షలు ఖర్చు చేస్తే గరిష్టంగా రూ. 40 లక్షల వరకు ఖర్చు చేయవచ్చని ఆదేశాలు జారీ చేసింది. అలాగే గరిష్టంగా ఉన్న ఖర్చు రూ. 40 లక్షలను అన్ని నియోజకవర్గాల్లో కాకుండా ఎక్కువ మంది ఓటర్లు ఉన్న పెద్ద నియోజకవర్గాలకు మాత్రమే కేటాయించింది. అసెంబ్లీ అంటే దాదాపు ఒకటిన్నర నుంచి 2 లక్షల వరకు ఓటర్లు ఉంటారు. అదే అత్యధిక ఓటర్లు కలిగిన నియోజకవర్గం అయితే 3 లక్షల మంది ఓటర్లు ఉంటారు. అలాంటి చోట బరిలో నిలిచిన అభ్యర్థి రూ. 40 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు. ఈ పరిమితికి మించకూడదు. అదే 2 లక్షల లోపు ఓటర్లు ఉన్న వాటిని చిన్న నియోజకవర్గాలుగా పరిగణస్తారు. ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులు రూ. 20 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు. అంతకు మించితే కచ్చితంగా ఎన్నికల కమిషన్ చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది.

ఇది ఎన్నికల సంఘం కేటాయించిన పరిమితి. వీటికి ఖచ్చితంగా రోజు వారి లెక్క చెప్పాల్సి ఉంటుంది. రోజు వారి ఖర్చును ఎలా చేస్తున్నారో రికార్డ్ మెయింటెన్ చేయాల్సి ఉంటుంది. కానీ వాస్తవానికి, ఈ వ్యయ పరిమితి చాలా అరుదుగా కట్టుబడి ఉంటాయి రాజకీయ పార్టీలు. ప్రచార ఖర్చులతో పాటు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అభ్యర్థులు ఉచితంగా డబ్బు ఖర్చు చేయడం మనకు తెలిసిందే. మరికొందరైతే కానుకల పేరుతో తాయిలాలు కూడా అందజేస్తూ ఉంటారు. ఇలాంటి వాటిని ఎన్నికల ఖర్చులోకి పరిగణించదు ఎన్నికల కమిషన్. వీటిపై తగు చర్యలు తీసుకుంటుంది.

మరిన్ని లోక్ సభ ఎన్నికల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..