Uttam Kumar Reddy: బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణలో రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఆసక్తికర పోరు నడుస్తోంది. అయితే బీఆర్ఎస్ నుంచి కేకే, కడియం, దానం లాంటివాళ్లు పార్టీ వీడటంతో అలాంటివాళ్లకు ప్రజలే గుణపాఠం చెబుతారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయిన విషయం తెలిసిందే.

Uttam Kumar Reddy: బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

|

Updated on: Mar 29, 2024 | 5:29 PM

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణలో రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఆసక్తికర పోరు నడుస్తోంది. అయితే బీఆర్ఎస్ నుంచి కేకే, కడియం, దానం లాంటివాళ్లు పార్టీ వీడటంతో అలాంటివాళ్లకు ప్రజలే గుణపాఠం చెబుతారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఇదే అంశంపై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందిస్తూ ‘‘ఇదేం పార్టీకి కొత్తకాదు.. తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు పట్టుమని 10 మంది కూడా పార్టీలో లేరు, పాతవాళ్లు పోయినా కొత్తరక్తంతో నింపుతాం’’ అని అన్నారు.

అయితే ఇదే విషయమై తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పనైపోయిందని, వారి గురించి మాట్లాడటం వృధా అని రియాక్ట్ అయ్యారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకం అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గత పదేళ్లలో తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదు అని, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 13-14 స్థానాలు వస్తాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చి చెప్పారు.

Follow us