AP TDP: అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. హైకమాండ్ నిర్ణయంపై ‘నల్లమిల్లి’ న్యాయ పోరాటం
అనపర్తి టికెట్ వ్యవహారం టీడీపీలో అసంతృప్తి జ్వాలలకు కారణమైంది. అనపర్తి అసెంబ్లీ స్థానం పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్లింది. దాంతో అనపర్తి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తీవ్ర నిరాశకు గురయ్యారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయన మద్దతుదారులు ఆందోళనలకు దిగారు.

అయితే తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం మహేంద్రవాడ నుండి రామకృష్ణారెడ్డి ప్రజాభిప్రాయ సేకరణ పర్యటన కు అనూహ్య స్పందన లభించింది. రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులతో ఇంటింటికి తిరుగుతూ ప్రజలతో మమేకమై టిడిపి నన్ను మోసం చేసిందని నేను ఏమి చేయాలని నేరుగా ప్రజల నుండి అభిప్రాయం సేకరించింది. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ తనకు జరిగిన అన్యాయనే వివరిస్తూ రామకృష్ణారెడ్డి న్యాయం కోసం నల్లమిల్లి ఎంతో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీవీ9తో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వారి కుటుంబ సభ్యులు మాట్లాడారు.
మహేంద్రవాడలో మొదటి రోజు పర్యటనకు అనూహ్యమైన స్పందన వస్తుందని, కార్యకర్తలు కన్నీళ్లు పర్యంతమవుతున్నారని రామకృష్ణారెడ్డి తెలిపారు. జరిగిన అన్యాయం దురదృష్టకరమని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారని ఆయన తెలిపారు. ప్రజలు ఏ విధంగా నిర్ణయిస్తే ఆ విధంగా ముందుకెళ్లడానికి సంసిద్ధంగా ఉన్నాన్నాని ఆయన తేల్చి చెప్పారు.