Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sleeping On Notes: కరెన్సీ నోట్లపై నిద్రించిన నేత.. వైరల్ అవుతున్న వీడియో.!

Sleeping On Notes: కరెన్సీ నోట్లపై నిద్రించిన నేత.. వైరల్ అవుతున్న వీడియో.!

Anil kumar poka

|

Updated on: Mar 29, 2024 | 10:16 PM

ఓ రాజకీయ నేత కరెన్సీ నోట్ల పై నిద్రించిన ఓ చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అవన్నీ 500 రూపాయల నోట్లే. అస్సాంలోని ఉదాల్‌గిరి జిల్లాకు చెందిన బెంజామిన్‌ బసుమతారీ అనే నేత వ్యవహారమిది. బోడోలాండ్‌ నేత అయిన బెంజామిన్‌పై తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం అమలులో అక్రమాలకు పాల్పడ్డారంటూ నమోదైన కేసుల్లో ఆయన నిందితుడు.

ఓ రాజకీయ నేత కరెన్సీ నోట్ల పై నిద్రించిన ఓ చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అవన్నీ 500 రూపాయల నోట్లే. అస్సాంలోని ఉదాల్‌గిరి జిల్లాకు చెందిన బెంజామిన్‌ బసుమతారీ అనే నేత వ్యవహారమిది. బోడోలాండ్‌ నేత అయిన బెంజామిన్‌పై తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం అమలులో అక్రమాలకు పాల్పడ్డారంటూ నమోదైన కేసుల్లో ఆయన నిందితుడు. ఆయన విలేజ్‌ కౌన్సిల్ డెవలప్‌మెంట్‌ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో ఈ పథకం లబ్ధిదారుల నుంచి లంచం తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజా చిత్రం వైరల్ అవుతోంది. దాంతో అవినీతి వ్యతిరేక పార్టీగా పేరుగాంచిన యునైటెడ్ పీపుల్స్‌ పార్టీ లిబరల్‌ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యూపీపీఎల్ పార్టీ చీఫ్ ప్రమోద్‌ బోరో ఎక్స్‌ వేదికగా స్పష్టత ఇచ్చారు. బెంజమిన్‌కు తమ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. ఈ ఏడాది జనవరి 10నే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశామని.. అలాగే ఫిబ్రవరి 10నే వీసీడీసీ ఛైర్మన్‌ పదవి నుంచి తొలగించామనీ.. ఆయన చర్యలకు తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..