AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wine Seize: ఆ రాష్ట్రాల్లో భారీగా మద్యం స్వాధీనం.. అక్కడే అత్యధికం

ఇటీవల ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో భారీగా మద్యం(Wine) స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల(Central Election Commission) సంఘం వెల్లడించింది. 85 లక్షల లీటర్లకు పైగా వైన్ ను....

Wine Seize: ఆ రాష్ట్రాల్లో భారీగా మద్యం స్వాధీనం.. అక్కడే అత్యధికం
wines bandh
Ganesh Mudavath
|

Updated on: Mar 10, 2022 | 6:38 AM

Share

ఇటీవల ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో భారీగా మద్యం(Wine) స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల(Central Election Commission) సంఘం వెల్లడించింది. 85 లక్షల లీటర్లకు పైగా వైన్ ను సీజ్ చేసినట్లు తెలిపింది. మద్యం స్వాధీనం చేసుకున్న రాష్ట్రాల్లో 70 శాతంతో పంజాబ్ మొదటి స్థానంలో ఉందని పేర్కొంది. మద్యంతో పాటు ఆయా రాష్ట్రాల్లో రూ.575.39 కోట్ల విలువైన డ్రగ్స్(Drugs) ను కూడా స్వాధీనం చేసుకున్నట్టు ఈసీ వివరించింది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు, మద్యం, మాదక ద్రవ్యాలు, విలువైన లోహాల పంపిణీని నిరోధించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, నిఘా బృందాల తనిఖీల్లో సీజ్ చేసుకున్న వాటి మొత్తం విలువ రూ.1061.87 కోట్లు ఉంటుందని తెలిపింది. 2017 ఎన్నికల్లో రూ.299.84కోట్లు విలువైన నిషేధిత పదార్ధాలు పట్టబడగా.. ప్రస్తుత ఎన్నికల్లో సీజ్ చేసుకున్న వాటి విలువ మూడున్నర రెట్లు అధికమని వెల్లడించింది. జనవరి 8 నుంచి 85,27,227 లీటర్ల మద్యాన్ని సీజ్‌ చేసినట్టు ఈసీ తెలిపింది. వీటిలో అత్యధికంగా పంజాబ్‌లో 59,65,496 లీటర్లు (రూ.36.79 కోట్లు), యూపీలో 22,94,614 లీటర్లు (రూ.62.13 కోట్లు), ఉత్తరాఖండ్‌లో 97,176 లీటర్లు (రూ.4.79 కోట్లు), గోవాలో 95,446 లీటర్లు (రూ.3.57 కోట్లు), మణిపూర్‌లో 74,495 లీటర్లు (రూ.73లక్షలు) చొప్పున స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది.

సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్న ఎన్నికల ఫలితాలు మరికొద్ది సమయంలో వెల్లడి కానున్నాయి. ఐదు రాష్ట్రాల్లో ఉత్కంఠగా సాగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురువారం జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. భారీగా భద్రతా బలగాలను మోహరించింది. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ లెక్కింపు ప్రక్రియను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఐదు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 1,200 కౌంటింగ్‌ హాళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. వీటిలో 750 కి పైగా ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే ఉన్నాయి. అన్నింటా గురువారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. యూపీలోని వారణాసి, మేరఠ్‌లలో అవకతవకలు చోటుచేసుకుంటున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించడంతో ఈసీ చర్యలు చేపట్టింది. దిల్లీ ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) రణ్‌బీర్‌సింగ్‌ను మేరఠ్‌లో, బిహార్‌ సీఈవో హెచ్‌.ఆర్‌.శ్రీనివాస్‌ను వారణాసిలో ఓట్ల లెక్కింపు పర్యవేక్షణ ప్రత్యేక అధికారులుగా నియమించింది.

Also Read

Director Pandiraj : త‌మిళం కంటే తెలుగు డ‌బ్బింగ్ స‌మ‌యంలోనే సూర్య ఎక్కువ ఎంజాయ్ చేశారు: పాండిరాజ్

బలహీనంగా ఉన్నవారికి ఈ 3 ఆయుర్వేద మందులు బెస్ట్‌.. సైడ్‌ ఎఫెక్ట్స్‌ అస్సలు ఉండవు..!

Nerve Pain Relief: నరాల నొప్పితో ఇబ్బందిపడుతున్నారా ? అయితే ఈ చిట్కాలు పాటిస్తే ఉపశమనం..