Lok Sabha Elections 2024: ఈవీఎంలు భద్రపరిచే గది ప్రత్యేకతలు ఇవే.. వీటి భద్రతను ఎవరు పర్యవేక్షిస్తారంటే..

లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటి వరకు అయిదు దశల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. మే 20న సోమవారం సాయంత్రం ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్‌కు తరలించారు. వాటిని సురక్షితంగా ఉంచేందుకు ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్‌లను సిద్ధం చేశారు ఎన్నికల అధికారులు. ఈవీఎంలతో పాటు VVPAT యంత్రాలను ఉంచడానికి స్ట్రాంగ్ రూములు సురక్షితమైన ప్రదేశం అని భావిస్తున్నారు అధికారులు. ఒక్కసారి ఈవీఎం మెషీన్‌ను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిస్తే పక్షి కూడా వాటిని చూడలేదని అంటున్నారు.

Lok Sabha Elections 2024: ఈవీఎంలు భద్రపరిచే గది ప్రత్యేకతలు ఇవే.. వీటి భద్రతను ఎవరు పర్యవేక్షిస్తారంటే..
Evm
Follow us

|

Updated on: May 22, 2024 | 4:28 PM

లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటి వరకు అయిదు దశల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. మే 20న సోమవారం సాయంత్రం ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్‌కు తరలించారు. వాటిని సురక్షితంగా ఉంచేందుకు ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్‌లను సిద్ధం చేశారు ఎన్నికల అధికారులు. ఈవీఎంలతో పాటు VVPAT యంత్రాలను ఉంచడానికి స్ట్రాంగ్ రూములు సురక్షితమైన ప్రదేశం అని భావిస్తున్నారు అధికారులు. ఒక్కసారి ఈవీఎం మెషీన్‌ను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిస్తే పక్షి కూడా వాటిని చూడలేదని అంటున్నారు. అందుకే దీన్ని స్ట్రాంగ్ రూమ్ అని పిలుస్తున్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఇక్కడి నుంచి బయటకు తీసుకెళ్తారు. ప్రతి నియోజకవర్గంలోని ఏ గదిని పడితే వాటిని స్ట్రాంగ్ రూమ్‌గా మార్చలేం. దానికి కొన్ని నిర్ణీత ప్రమాణాలు కూడా ఉన్నాయి.

డబుల్ లాకింగ్ సిస్టమ్‌తో కూడిన గది..

EVMలను ఉంచడానికి ఉపయోగించే స్థలం కొన్ని ప్రమాణాలను కలిగి ఉంటుంది. ఎన్నికల సంఘం ప్రకారం స్ట్రాంగ్‌రూమ్‌గా ఉండే గదికి ఒకే తలుపు ఉండాలి. ఇక్కడికి చేరుకోవడానికి వేరే మార్గం ఉండకూడదు. గదిలో డబుల్ లాక్ సిస్టమ్ ఉంటుంది. ఈవీఎం, వీవీప్యాట్‌ యంత్రాలను ఇక్కడ ఉంచిన తర్వాత స్ట్రాంగ్‌రూమ్‌కు తాళం వేసి ఉంచాలి. వాటిని సీల్ చేస్తారు సంబంధిత జిల్లాస్థాయి ఉన్నతాధికారులు. దాని తాళం జిల్లా పరిపాలనా అధికారి లేదా అంతకంటే పెద్ద స్థాయి అధికారుల వద్ద ఉంటుంది. స్ట్రాంగ్‌రూమ్‌ను రూపొందిస్తున్నప్పుడు వర్షం లేదా వరద నీరు లోనికి చేరుకునేలా ఉండకూడదు. అలాగే అగ్ని ప్రమాదం జరిగే విధంగా కూడా ఉండకూడదు. గోడలకు ఎటువంటి నష్టం కలుగకుండా ఉండేలా చాలా దృఢంగా ఉండాలి. అప్పుడే దానిని స్ట్రాంగ్ రూమ్‎గా పరిగణిస్తారు.

స్ట్రాంగ్‌రూమ్‌కు భద్రత ఎలా ఉంది?

స్ట్రాంగ్‌రూమ్‌ భద్రత కోసం 24 గంటలు సీఏపీఎఫ్‌ సిబ్బందిని నియమిస్తారు. సైనికుల కొరత ఉంటే అవసరమైనంత మందిని కేటాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయవచ్చు. సైనికుల మోహరింపు మాత్రమే కాదు, స్ట్రాంగ్ రూమ్‌ను 24 గంటలు సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తారు. స్ట్రాంగ్‌రూమ్‌ ముందు భాగంలో కంట్రోల్‌ రూం కూడా ఏర్పాటు చేసి, దాని భద్రతను పర్యవేక్షిస్తారు. దాని భద్రత కోసం, CAPF సైనికులతో పాటు, రాష్ట్ర పోలీసులను కూడా విధుల్లో మోహరింపజేస్తారు. ప్రతి స్ట్రాంగ్‌రూమ్‌కు భద్రతను నిర్ధారించడానికి ఒక పోలీసు అధికారి, ప్రభుత్వ ఉన్నతాధికారి అన్ని సమయాలలో అందుబాటులో ఉంటారు.

ఇవి కూడా చదవండి

స్ట్రాంగ్ రూమ్‌కు 3 అంచల భద్రత ఉంటుంది. మొదట CAPF గార్డులు కాపలాగా ఉంటారు. ఆ తరువాత ప్రత్యేక పోలీసుల బృందం ఉంటుంది. మూడవ సర్కిల్‎లో జిల్లాల కార్యనిర్వాహక అధికారులు, భద్రతా సిబ్బంది ఉంటారు. వీరందనినీ దాటుకుని ఈవీఎంల వద్దకు చేకుకోవడం అసాధ్యం. 24 గంటలు సీసీటీవీ కెమెరాలు పర్యవేక్షిస్తూ ఉంటాయి కాబట్టి స్ట్రాంగ్ రూమ్ భద్రతలో విద్యుత్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందువల్ల నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకుంటారు. ప్రధాన ఎన్నికల అధికారి విద్యుత్‌ బోర్డు చైర్మన్‌కు లేఖ రాసి ఎలాంటి కరెంట్ కోతలు తలెత్తకుండా చూడాలని కోరుతారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా అవసరమైనన్ని జనరేటర్‌‎లను కూడా ఏర్పాటు చేస్తారు.

మరిన్ని ఎన్నికలకు సంబంధించిన వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్