Woman Killed in Train: అన్నా.. వేధిస్తున్నారంటూ ఫోన్ చెసి చెప్పింది.. పోలీసులు వచ్చేలోపే ఘోరం జరిగిపోయింది..
Woman Killed in Train: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సెహోర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. లైంగిక వేధింపుల నేపథ్యంలో ప్రతిఘటించిందనే...
Woman Killed in Train: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సెహోర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. లైంగిక వేధింపుల నేపథ్యంలో ప్రతిఘటించిందనే ఆగ్రహంతో ఓ యువతిని కదులుతున్న రైలులోనే గొంతుకోసి చంపేశారు దుండగులు. ఈ ఘటన మంగళవారం అర్థరాత్రి ఇండోర్-బిలాస్‌పూర్ రైలులో సేహోర్ రైల్వే స్టేషన్‌కు 2 కిలోమీటర్ల దూరంలో చోటు చేసుకుంది. ఈ ఘటన తాలూకు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ముస్కాన్ హడా(21) యువతి ఇండోర్ నుంచి భోపాల్‌కు తన అన్నను కలిసేందుకు ఇండోర్-బిలాస్‌పూర్ ట్రైన్‌లో వెళ్తోంది. అయితే కొందరు దుండగులు ఆ యువతిని రైలు ఎక్కినప్పటి నుంచి వేధించసాగారు. ఈ క్రమంలో వేధింపులు కాస్తా శృతిమించి ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించారు. అయితే యువతి వారిని ప్రతిఘటించడంతో ఆగ్రహించిన దుండగులు.. పదునైన కొత్తితో ఆమె గొంతు కోసేశారు. అంతకు ముందే ఈ దుండగుల వేధింపుల గురించి తన అన్నకు కాల్ చేసి చెప్పగా.. అతను 100కు డయల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఆ ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సేహోర్ రైల్వే స్టేషన్‌లో వేచి ఉండగా.. అప్పటికే దుండగులు ఆ యువతి గొంతు కోసేశారు. దాంతో యువతి పెద్దగా అరుస్తూ రైలులోనే పరగులు తీసింది. అది చూసిన ప్రయాణికులు భయపడిపోయారు. తీవ్ర రక్తస్త్రావంతో యువతి రైలు బెర్త్‌పై కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచింది. యువతిని చంపేసిన దుండగులు సేహోర్ రైల్వే స్టేషన్‌కు ముందే దిగిపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. యువతిని చంపిన నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
Also read:
Mani Ratnam Birthday: నాటికి.. నేటికి.. ఆయన సినీ ఇండస్ట్రీలో ఓ నవరత్నం.. ఈ ‘మణి’రత్నం..