Suspect Rape Murder: హైదరాబాద్ శివారులో దారుణం.. గుర్తు తెలియని మహిళపై అఘాయిత్యం.. ఆపై దారుణ హత్య..!

మరోసారి మానవ మృగాలు రెచ్చిపోయాయి. ఓ అభాగ్యురాలి పట్ల అమానుషంగా ప్రవర్తించి హతమార్చారు. అలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన హైదరాబాద్ మహానగర శివారులో చోటుచేసుకుంది.

Suspect Rape Murder: హైదరాబాద్ శివారులో దారుణం.. గుర్తు తెలియని మహిళపై అఘాయిత్యం.. ఆపై దారుణ హత్య..!

Woman Suspect Rape and Murder: మరోసారి మానవ మృగాలు రెచ్చిపోయాయి. ఓ అభాగ్యురాలి పట్ల అమానుషంగా ప్రవర్తించి హతమార్చారు. అలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన హైదరాబాద్ మహానగర శివారులో చోటుచేసుకుంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి అన్నోజిగూడలో ఓ గుర్తు తెలియని మహిళపై లైంగిక దాడి చేసి హత్య చేశారు. సీఐ చంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం… ఘట్‌కేసర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అన్నోజిగూడ సర్వీసు రోడ్డు పక్కన ఉండే భవనంపై కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఓ గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. దీంతో వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న మహిళ మృతదేహాన్ని పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు.

30నుంచి 40సంవత్సరాల వయసు గల మహిళ శరీరంపై దుస్తులు లేకుండా మృతిచెంది ఉంది. మృతదేహం కుళ్లిపోయి ఉండటంతో శరీరంపై గాయాలు కనిపించడంలేదని, రెండు రోజుల క్రితమే సంఘటన జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆధారాలు సేకరించడానికి క్లూటీంను రప్పించినట్లు పోలీసులు తెలిపారు. హత్య జరిగిన తీరుపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని సీఐ చంద్రబాబు పేర్కొన్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించామన్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

Read Also…  షాకింగ్.. కరోనాతో ప్రముఖ జర్నలిస్ట్ TNR మృతి.. సంతాపం వ్యక్తం చేస్తున్న సినీ ప్రముఖులు..